Pavan Kalyan: ట్రిపుల్ పవర్.. పవన్ నెక్స్ట్ సినిమా కాంబో చూస్తే పూనకాలే

స్టార్ హీరో పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు సినిమాలు కమిటైన సంగతి తెలిసిందే. ఇక తాజాగా పవర్ స్టార్ ఖాతాలో మరో మూవీ చేరింది. డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుందని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది.

New Update
Pavan Kalyan: ట్రిపుల్ పవర్.. పవన్ నెక్స్ట్ సినిమా కాంబో చూస్తే పూనకాలే

Pavan Kalyan:  ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీ ఎలెక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో షూటింగ్స్ కాస్త గ్యాప్ ఇచ్చారు. గత కొంత కాలంగా షూటింగ్స్, రాజకీయాలు రెండింటికీ.. సమయాన్ని కేటాయించిన పవన్.. ఎలెక్షన్స్ నేపథ్యంలో పూర్తి ఫోకస్ రాజకీయాల పై పెట్టారు. ఇప్పటికే కమిట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు సినిమాల పక్కన పెట్టేశారు. ఈ చిత్రాలు సంబంధించి కొంత షూటింగ్ పూర్తయింది. మిగతా షెడ్యూల్స్ కూడా పూర్తి చేయడానికి.. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఫ్రీ అవుతారా అని ఎదురుచూస్తున్నారు నిర్మాతలు. ఇది ఇలా ఉంటే పవర్ స్టార్ సినిమాలకు సంబంధించి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.

అట్లీ - త్రివిక్రమ్- పవన్ కళ్యాణ్

డైరెక్టర్ అట్లీ, త్రివిక్రమ్ కాంబినేషన్ లో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కబోతుందని నెట్టింట్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే కమిట్ మూడు సినిమాలు ఇంకా ఇంకా పూర్తి కాకముందే పవన్ ఖాతాలో మరో మూవీకి ఒకే చెప్పడం ఆసక్తి కరంగా మారింది. అయితే ఎలెక్షన్స్ పూర్తయిన తర్వాత సినిమాల షూటింగ్ వేగంగా పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముందుగా ఒకే చేసిన మూడు చిత్రాల తర్వాత.. పవన్ కళ్యాణ్ అట్లీ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది. ఓజీ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రాబోతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ డైరెక్ట్ చేయగా.. హరహర వీర మల్లు చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తెరకెక్కింస్తున్నారు.

Also Read: Anudeep Movie : అనుదీప్ మూవీలో “సప్త సాగరాలు దాటి” .. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా

publive-image

డైరెక్టర్ అట్లీ ఇటీవలే హిందీ మూవీ జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. బిగిల్, రాజా రాణి, తేరి, మెర్సల్ వంటి సూపర్ హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. రాజా రాణి సినిమాతో డెబ్యూ డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అట్లీ దర్శకత్వంలో రాబోతున్న పవన్ కళ్యాణ్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ నిర్మిస్తున్నట్లు సమాచారం.

Also Read: Anupama : వరుస ఫొటో షూట్స్‌తో కుర్రకారు మతిపొగొడుతున్న కర్లీ భామ!

Advertisment
తాజా కథనాలు