Pavan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి..!

మైక్రోసాఫ్ట్ కొత్త బాస్ గా పవన్ దావులూరి బాధ్యతలు చేపట్టనున్నారు. పవన్ ఐఐటీ మద్రాస్‌లో చదివారు. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్‌కి కొత్త బాస్‌గా పవన్ నియమితులయ్యారు. యూఎస్ టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల దిగ్గజాల్లో దావులూరి చేరారు.

New Update
Pavan Davuluri: మైక్రోసాఫ్ట్ విండోస్ కొత్త బాస్‌గా ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్ పవన్ దావులూరి..!

Pavan Davuluri to Lead Microsoft Windows: మైక్రోసాఫ్ట్ కొత్త హెడ్‌గా పవన్ దావులూరి బాధ్యతలు చేపట్టనున్నారు. పవన్‌కు మైక్రోసాఫ్ట్ బాధ్యతలు అప్పగించారు. ఐఐటీ మద్రాస్‌లో (IIT Madras) చదివిన పవన్ దావులూరి మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్‌కు కొత్త బాస్‌గా నియమితులయ్యారు. పనోస్ పనాయ్ గతంలో ఈ పదవికి అధిపతిగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తర్వాత ఈ బాధ్యతను పవన్‌కు అప్పగించారు. పనోస్ గత సంవత్సరం మైక్రోసాఫ్ట్ విండోస్‌ను విడిచి అమెజాన్‌లో చేరిన సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్ విండోస్,సర్ఫేస్ గ్రూపులను వేరు చేసింది. వీరిద్దరి నాయకత్వం కూడా భిన్నంగా ఉండేది. గతంలో సర్ఫేస్ సిలికాన్ పనులు పవన్ చూసుకునేవాడు.

ఎవరీ పవన్ దావులూరి?
జాతీయ పత్రికల కథనాల ప్రకారం.. పవన్ దావులూరి ఐఐటి మద్రాస్ నుండి పట్టభద్రుడయ్యాడు.తర్వాత అతను మేరీల్యాండ్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి మైక్రోసాఫ్ట్‌లో చేరాడు. గత 23 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్‌లో పని చేస్తున్నాడు. పవన్‌కి భారత్‌తో చాలా ప్రత్యేక అనుబంధం ఉంది. అమెరికన్ కంపెనీల్లో నాయకత్వ పాత్రల్లో కొంతమంది భారతీయులు మాత్రమే ఉన్న లీడర్‌షిప్ గ్రూప్‌లో పవన్ ఇప్పుడు చేరారు. ఇందులో సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ (Sundar Pichai) వంటి పేర్లు ఉన్నాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ అండ్ సర్ఫేస్ హెడ్ అయిన తర్వాత పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడు అనే విషయంపై ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కాగా మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డివైజ్‌ల హెడ్‌గా ఉన్న రాజేష్ ఝాకు పవన్ రిపోర్ట్ చేస్తారు. రాజేష్ ఝా అంతర్గత లేఖ ద్వారానే పవన్ కుండ గురించి సమాచారం అందింది. మైక్రోసాఫ్ట్‌లో పవన్ దావులూరిని నియమించాలని కంపెనీ నిర్ణయించినట్లు ఈ అంతర్గత లేఖలో పేర్కొన్నారు. ఈ బృందానికి దావులూరి నేతృత్వం వహిస్తారు.

మైక్రోసాఫ్ట్‌తో 23ఏళ్ల అనుబంధం :
దావులూరికి మైక్రోసాఫ్ట్‌తో 23ఏళ్లకు పైగా అనుబంధం ఉంది. యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దావులూరి మైక్రోసాఫ్ట్‌లో రిలయబిలిటీ కాంపోనెంట్ మేనేజర్‌గా అందులో చేరారు.కెవిన్ స్కాట్ పర్యవేక్షణలో మిఖాయిల్ పరాఖిన్ (WWE) నుంచి కొత్త పాత్రలను మారాల్సి వచ్చింది. విండోస్ ఎక్స్‌పీరియన్స్, విండోస్ + డివైజ్‌లను ఎక్స్‌పీరియన్స్ + డివైసెస్ (E+D) విభాగంలో విలీనం చేయడంతో పవన్ దావులూరి నేతృత్వంలోని ఏఐ విభాగం సిస్టమ్‌లు, ఎక్స్‌పీరియన్స్ డివైజ్‌‌లను డెవలప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. శిల్పా రంగనాథన్, జెఫ్ జాన్సన్ నేరుగా దావులూరికి రిపోర్ట్ చేయనున్నారు.

ఇది కూడా చదవండి: క్షీణించిన కేజ్రీవాల్ ఆరోగ్యం.. 46కు పడిపోయిన షుగర్ లెవల్స్!

Advertisment
తాజా కథనాలు