PAYTM BUMPER OFFER.. 100 శాతం క్యాష్ బ్యాక్! Paytm సంస్థ తమ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పేటీఎం యాప్ ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకుంటే రూ.500 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్లు తెలిపింది. అలాగే ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్న ఆరు గంటలోపు క్యాన్సల్ చేసుకుంటే పూర్తి డబ్బు వాపస్ చేయనున్నట్లు ప్రకటించింది. By V.J Reddy 05 Nov 2023 in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి దీపావళి పండుగ సందర్భంగా ప్రముఖ యూపీఐ పేమెంట్స్ యాప్ పేటీఎం(Paytm) తమ యూజర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ పండుగ సీజన్‌లో ప్రయాణించాలనుకునే వారికి ప్రత్యేక తగ్గింపులను అందిస్తోంది. రైలు, బస్సు టిక్కెట్ల కొనుగోలుపై పలు రాయితీలు అందిస్తున్నట్లు పేటీఎం సంస్థ తెలిపింది. ఆఫర్ పూర్తీ వివరాలు మీకోసం: ALSO READ: ఈ నెల 7న అకౌంట్లోకి డబ్బు జమ బస్సు టికెట్ ఆఫర్లు: Paytm ద్వారా బస్సు టికెట్ బుక్ చేసుకునేవారికి 500 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. అంతే కాకుండా రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్‌తో లైవ్ బస్ ట్రాకింగ్ సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. దీనిద్వారా మీరు ప్రయాణిస్తున్న బస్సు లొకేషన్‌ను మీ యొక్క పరిచయాలతో పంచుకోవచ్చని తెలిపింది. రైలు టిక్కెట్లపై అఫర్: మీరు మీ యొక్క రైలు టికెట్‌ను పేటీఎం ద్వారా బుక్ చేసుకొని.. వాటిని ఆరు గంటల్లోపు రద్దు చేసుకోవాలని అనుకుంటే దానికి తమ సంస్థ ఎలాంటి ఛార్జీలు వాసులు చేయదని.. తక్షణ రిఫండ్ కూడా అందిస్తామని పేటీఎం ప్రకటించింది. ఈ ఆఫర్ తత్కాల్ సహా అన్ని రకాల రైలు టిక్కెట్లకూ వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. పేటీఎం ప్లాట్‌ఫామ్‌లో యూపీఐ ద్వారా రైలు టిక్కెట్ కోసం చెల్లింపులు జరిపినప్పుడు ఎలాంటి అదనపు రుసుములు ఉండవని పేటీఎం వెల్లడించింది. ALSO READ: కామారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి! #diwali-offers #refund #bus-train-tickets #paytm-offer మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి