Telangana: ఇకనుంచి ఓపీ కోసం వేచిచూడాల్సిన పని లేదు.. క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తప్పింది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే రోగులు ఓపీ చీటి అందుకునే సౌకర్యం లభించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది.

New Update
Telangana: ఇకనుంచి ఓపీ కోసం వేచిచూడాల్సిన పని లేదు.. క్యూఆర్‌ కోడ్‌తో స్కాన్‌

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ కోసం రోగులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తప్పింది. క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేస్తే వెంటనే రోగులు ఓపీ చీటి అందుకునే సౌకర్యం లభించింది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (IBDM) పేరుతో కేంద్ర ప్రభుత్వం దీనిపై ప్రత్యేక కార్యచరణ అమలు చేస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా 102 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు హైదరాబాద్‌లోని 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ క్యూఆర్‌ కోడ్ విధానాన్ని అమలు చేస్తున్నారు.

వైద్య రంగంలో ఆధునిక సాంకేతికను వినియోగించి మెరుగైన వైద్య చికిత్సలు వెంటనే అందించాలని ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా ప్రజలకు డిజిటల్ హెల్త్ కార్డ్ ఇవ్వాలని 2021లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రతిఒక్కరికీ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ నుంచి ఆధార్ కార్డ్ నెంబర్‌ను లింక్ చేసి 14 అంకెలు ఉండే యూనిక్‌ నంబర్‌ను కేటాయిస్తుంది. ముందుగా ప్లేస్టోర్ నుంచి అభా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వన్‌టైమ్ పాస్‌వర్డ్‌ వస్తుంది. ఆ తర్వాత పేరు, అడ్రస్, ఆధార్, ఫోన్ నెంబర్‌, తదితర వివరాలు అందులో పొందుపరిచాలి. సొంత ఐడీ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకొని అభా యాప్‌ ద్వారా లాగిన్ కావాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే టోకెన్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత కౌంటర్ వద్దకు వెళ్లి టోకెన్ నంబర్‌ను చూపిస్తే సంబంధిత విభాగానికి రిఫర్ చేస్తూ ఓపీ చీటి ఇస్తారు. అంతేకాదు ఈ క్యూఆర్‌ కోడ్‌ను ఎలా స్కాన్ చేయాలో అనేదాన్ని రోగులకు వివరించేందుకు ఆసుపత్రుల్లో సహాయకులను కూడా అందుబాటులో ఉంచారు.

Also Read: వినేష్‌ ఫొగాట్‌పై అనర్హత వేటు.. రెజ్లింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి

అభా నెంబర్‌తో వైద్య చీటీలన్ని కూడా డిజిటలైజేషన్ అవుతాయి. దీనివల్ల దేశంలో ఎక్కడ ఉన్నా ఒక్క క్లిక్‌తో వైద్యులు వాటి వివరాలు పొందే అవకాశం ఉంటుంది. రోగికి ఇప్పటివరకు వైద్య చికిత్స అందించిన వివరాలు అందులో ఉంటాయి. దీంతో మరో వైద్యుడు వాటిని చూసి మెరుగైన వైద్యం అందించే వెసులుబాటు ఉంటుంది. ఇక హైదరాబాద్‌లో18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్యూఆర్‌ కోడ్‌ అందుబాటులో ఉంది. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, సరోజినీదేవి, ఫీవర్, ఎర్రగడ్డ చెస్ట్, మెంటల్ ఆసుపత్రులు, పేట్లబురుజు, సుల్తాన్ బజార్ మెటర్నిటీ హాస్పిటల్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కింగ్‌ కోఠి, ఎంసీహెచ్ కింగ్‌కోఠి, ఈఎన్‌టీ, నాంపల్లి, గోల్కొండ, మలక్‌పేట ఏరియా ఆసుపత్రులు, ఎంసీహెచ్‌ షాలిబండ, బార్కాస్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, సీబెచ్‌సీ ఖైరతాబాద్‌లలో ఈ క్యూర్‌ కోడ్ సేవలు వినియోగించుకోవచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు