ఎమ్మెల్యే పెద్ద కుమారుడు కన్నుమూత!

బీఆర్ఎస్ పార్టీ పటాన్‌ చెరు ఎమ్మెల్యే ఇంట విషాదం నెలకొంది. ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి పెద్ద కుమారుడు విష్ణు వర్థన్ రెడ్డి మృతి చెందారు.కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విష్ణు గురువారం ఉదయం కాంటినెటల్‌ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటు కన్నుమూశాడు.

New Update

patancheru mla son passes away

దీంతో మహిపాల్ రెడ్డి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. విష్ణు కూడా పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటాడు. విష్ణు మరణ వార్త తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మహిపాల్‌ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి.

పార్టీ నేతలు, కార్యకర్తలు విష్ణు మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు. విష్ణుకి భార్య ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించే విష్ణు మరణ వార్త తెలుసుకున్న నియోజక వర్గ ప్రజలు కన్నీరు పెడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు