Tirupati : జగన్ సిద్ధం సభకు వెళ్లిన బస్సులు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు

వైసీపీ ‘సిద్ధం’ సభలు.. ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రకాశం జిల్లా అద్దంకిలో సిద్ధం సభకు కోసం తిరుపతి నుండి 450 బస్సులు తరలించడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. బస్టాండ్లలోనే గంటల తరబడి నిరీక్షిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tirupati : జగన్ సిద్ధం సభకు వెళ్లిన బస్సులు.. అవస్థలు పడుతున్న ప్రయాణికులు
New Update

Siddam Sabha :  ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఏపీ సీఎం జగన్(AP CM Jagan) ‘సిద్ధం’ సభ(Siddam Sabha) లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సభలు ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సభ కోసం భారీ ఎత్తున బస్సులు(Buses) తరలించడంతో పలుచోట్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి బస్టాండ్లలోనే నిరీక్షిస్తున్నా ..అధికారులు మాత్రం సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది.

Also Read : మీ చెవులు చెప్పే మాట వినండి.. ఈ తప్పులు చేయకండి.. 

ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి(Addanki) లో సిద్ధం సభకు తిరుపతి(Tirupati) నుండి 450 బస్సులు వెళ్లాయి. దాంతో తిరుపతి జిల్లా బస్టాండ్ లో బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు ఆర్టీసీ బస్టాండ్ లో బస్సులు లేకపోవడంతో లబోదిబో మంటున్నారు. తమ సొంత ప్రాంతాలకు వెళ్ళటానికి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : పవన్ కళ్యాణ్ అనంతపురంలో పోటీ చేస్తే జరిగేది ఇదే: మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి

సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు బస్సుల్లో జనాలను తరలించడంపై మండిపడుతున్నారు. పెద్ద మొత్తం బస్సులో సభకు ప్రజలను తరలిస్తే ప్రయాణికుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.

#tirupati #ap-cm-ys-jagan #ycp-siddam-sabha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe