పార్లమెంట్ విజిటర్స్ గేట్ క్లోజ్.. ఆ పాసులున్నా నో పర్మిషన్ భద్రతా అవసరాల రిత్యా పార్లమెంటు హౌస్ ఆవరణలోకి విజిటర్స్ ప్రవేశించే గెట్లను మూసివేశారు. అధికారిక పాసులతో వచ్చిన పౌరులను సైతం ప్రస్తుతానికి లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. సందర్శకులపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని అధికారులు తెలిపారు. By srinivas 14 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి పార్లమెంట్‌లో భద్రతా లోపం తలెత్తడంతో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్ లోకి సందర్శకులు ప్రవేశించే గేట్లు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు అగంతకులు సభలోకి చొరబడి కలర్ పొగ వదలడంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. అక్కడున్న ఎంపీలు కొంతమంది భయంతో బయటకు పరుగులు తీశారు. మరికొంతమంది నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో బుధవారం సభా కార్యకలాపాలు వాయిదా పడగా భద్రతా లోపంపై ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భద్రత అవసరాల రిత్యా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పార్లమెంటు హౌస్ ఆవరణలోకి విజిటర్స్ ప్రవేశించే గెట్లను మూసివేశారు. అధికారిక పాసులతో వచ్చిన పౌరులను సైతం ప్రస్తుతానికి లోపలికి అనుమతించబోమని స్పష్టం చేశారు. అయితే పార్లమెంట్ కు వచ్చే సందర్శకులపై ఎలాంటి నిషేధాజ్ఞలు విధించలేదని అధికారులు తెలిపారు. ఇక పార్లమెంట్ సమావేశాలు జరుతున్నప్పుడు దేశ పౌరులు రెండు గంటలపాటు హాజరయ్యే విధంగా పాసులు జారీ చేస్తారు. ఇది కూడా చదవండి :Cyber Crime: ఒక్క వాట్సప్ వీడియోకాల్.. రూ.19 లక్షలు హాంఫట్! ఇదిలావుంటే దీనిపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. పార్లమెంటులో భద్రత వైఫల్యం అత్యంత తీవ్రమైన అంశమని పేర్కొన్నారు. ఇక లోక్‌సభలోకి అంగతకులు ఎంట్రీ ఇవ్వడంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అలాగే కేంద్ర హోంమంత్రి పార్లమెంటు ఉభయసభల్లోనూ ప్రకటన చేయాలని కోరింది. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. అలాగే సభలో ఆగంతకులు వదిలిన పొగ హానికరమైనది కాదని ప్రాథమిక దర్యాప్తులో తేలినప్పటికీ నిందితులు వదిలిన గ్యాస్‌పై విచారణ చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. #parliament #visitors #gate-close మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి