Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. By V.J Reddy 11 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. జూన్ 24, 25 తేదీల్లో కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మూడోసారి ప్రధానిగా మోదీ ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది. ఇక మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఆంధ్రప్రదేశ్ 3, తమిళనాడు 3, హర్యాణాకు 3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, ఝూర్ఖండ్ రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు (MP Seats) కేటాయించారు. ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, అరుణచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. #parliament-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి