Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 24న కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. By V.J Reddy 12 Jun 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Parliament Sessions: ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. జులై 3 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. జూన్ 24న కొత్తగా ఎన్నుకోబడ్డ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 26న స్పీకర్ ఎంపిక జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మూడోసారి ప్రధానిగా మోదీ ఈ నెల 9న ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 71 మంది ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మోదీ మంత్రి వర్గంలో ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయన్నదానిపై ఆసక్తి నెలకొంది. ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీల వివరాలు పరిశీలిస్తే.. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కు 10 మంత్రి పదవులు దక్కాయి. ఆ తర్వాత బిహార్ 8 మంది మంత్రులతో రెండో స్థానంలో నిలించింది. ఇక మహారాష్ట్ర 6, మధ్యప్రదేశ్ 5, రాజస్థాన్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఆంధ్రప్రదేశ్ 3, తమిళనాడు 3, హర్యాణాకు 3 మంత్రి పదవులు దక్కాయి. అలాగే తెలంగాణ, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, ఒడిశా, ఝూర్ఖండ్ రాష్ట్రాలకు రెండేసి మంత్రి పదవులు (MP Seats) కేటాయించారు. ఢిల్లీ, గోవా, జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, అరుణచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు ఒక్కో మంత్రి పదవి దక్కింది. #parliament-sessions మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి