Parliament Session: లోక్సభలో గందరగోళం.. సభను వాయిదా వేసిన స్పీకర్

లోక్సభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకుపై తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను మధ్యాహ్నం 12గంటలకు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా.

Parliament Session: లోక్సభలో గందరగోళం.. సభను వాయిదా వేసిన స్పీకర్
New Update

Parliament Session: లోక్సభలో గందరగోళం నెలకొంది. నీట్ పేపర్ లీకుపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 12గంటలకు లోక్ సభను వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. విద్యార్థులకు సభ నుంచి ఓ సందేశం ఇవ్వాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. విద్యార్థులకు అండగా ఉంటామన్న భరోసాను అధికార, విపక్షాలు ఇవ్వాల్సి ఉందని వ్యాఖ్యానించారు. సభలో నీట్ అంశంపై పూర్తిస్థాయి చర్చ జరగాల్సి ఉందని రాహుల్ గాంధీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం తర్వాత ఈ అంశంపై చర్చిద్దాం అని స్పీకర్ తెలిపారు. తక్షణమే చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో సభను వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా.

#parliament-session
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి