Telangana: ఎంపీ ఎలక్షన్స్‌పై బీజేపీ ఫోకస్.. టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెనుకబడిన బీజేపీ.. ఎంపీ ఎన్నికల్లో మాత్రం తమ సత్తా చాటాలని భావిస్తోంది. కనీసం 8 సీట్లను టార్గెట్‌గా పెట్టుకుంది. అయితే, ఎంపీ సీట్ల కోసం బీజేపీలో పోటీ పెరిగింది. తామంటే తాము పోటీ చేస్తామని ముందుకొస్తున్నారు. By Shiva.K 12 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Telangana BJP Leaders: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసింది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోగా.. కాంగ్రెస్ 65 స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక అధికారం తమదేనంటూ ఎంతో దూకుడు ప్రదర్శించిన బీజేపీ కేవలం 8 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిల పడిన బీజేపీకి.. ప్లార్లమెంట్ ఎన్నికలు ప్లస్ అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు గట్టి విశ్వాసంతో ఉన్నారు. అందకే.. అసెంబ్లీ పోతే పోయింది.. పార్లమెంట్ ఎన్నికలను చూసుకుందాం అంటున్నారు కమలం నేతలు. ఈ క్రమంలోనే.. పార్లమెంట్ ఎన్నికలకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు. గత ఎన్నికలను పరిశీలిస్తే.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంది బీజేపీ. ఈ సారి అంతకు మించి వస్తాయని అంచనా వేస్తోంది. అందుకే.. పార్లమెంట్ సెగ్మెంట్‌లో పోటీసి ఆసక్తి చూపుతున్న నేతల సంఖ్య భారీగా పెరుగుతోంది. గత ఎన్నికల్లో 4 సీట్లు గెలుచుకుంటే.. ఈ సారి 8 సీట్లను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది బీజేపీ. ఆ మేరకు ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చిన పోలింగ్ శాతాన్ని మరింత పెంచుకునేలా వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణ జరిగిన ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు గెలుచుకున్న బీజేపీ.. 19 అసెంబ్లీ స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. పార్లమెంట్ ఎన్నికల్లో 25 శాతానికి ఓటింగ్ పెంచుకోవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. గత లోక్‌సభ ఎన్నికల్లో 4 ఎంపీ సీట్లు గెలుచుకోగా.. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు ఛాన్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సారి ఆదిలాబాద్ ఎంపీ సీటు రాథోడ్ బాపురావుకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సీటు కోసం మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ నుంచి మరోసారి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి అర్వింద్ పోటీలో ఉండనున్నారు. మిగతా 13 స్థానాల కోసం పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది. బీజేపీ ఎంపీగా పోటీకి సిద్ధంగా ఉన్న నేతలు.. మల్కాజిగిరి - మురళీధర్ రావు మహబూబ్‌నగర్ - డి.కె.అరుణ, జితేందర్ రెడ్డి, ఆచారి మెదక్ - రఘునందన్ రావు చేవెళ్ల - కొండా విశ్వేశ్వర్ రెడ్డి భువనగిరి - బూర నర్సయ్య గౌడ్ జహీరాబాద్ - రాజాసింగ్ ప్రయత్నాలు, అశోక్ ముస్తాపురే, చీకోటి ప్రవీణ్ పెద్దపల్లి - సోగల కుమార్ నాగర్‌కర్నూలు - బంగారు శృతి వరంగల్ - కృష్ణ ప్రసాద్, మాజీ డీజీపీ నల్లగొండ - గార్ల జితెందర్, సంకినేని వెంకటేశ్వర రావు హైదరాబాద్ - భగవంత్ రావు, రాజాసింగ్‌ను పోటీ చేయించే ఛాన్స్ మహబూబాబాద్ - రామచంద్రునాయక్, హుస్సెన్ నాయక్, దిలీప్ నాయక్ ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి Also Read: ప్రొఫెసర్‌కు గుండెపోటు.. సాయం చేసిన విద్యార్థులపై కేసు నమోదు.. ఎందుకంటే.. అంతరిక్ష కేంద్రంలో టమాటా మాయం.. 8 నెలల తరువాత ప్రత్యక్షం..! #general-elections-2024 #telangana-bjp-leaders #pm-elections మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి