Paritala Sriram: ఎమ్మెల్యే కేతిరెడ్డికి పరిటాల శ్రీరామ్ వార్నింగ్.! అభివృద్ధి పేరుతో ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఉపేక్షించబోమని టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. తాడిమర్రిలో రహదారుల ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి బాధితులకు సరైన పరిహారం ఇవ్వకుండా నివాస గృహాలు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. By Jyoshna Sappogula 17 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ అనంతపురం New Update షేర్ చేయండి Paritala Sriram warning to MLA Kethi Reddy: అభివృద్ధి పేరుతో ధర్మవరం నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెడితే చూస్తూ ఉపేక్షించబోమని ధర్మవరం తెదేపా ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్(TDP Paritala Sriram) హెచ్చరించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి (MLA Kethi Reddy) అభివృద్ధి పేరుతో ప్రజలను తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాడిమర్రిలో రహదారుల ఏర్పాటు పేరుతో ఎమ్మెల్యే కేతిరెడ్డి సరైన పరిహారం ఇవ్వకుండా నివాస గృహాలు కూల్చివేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన బాధితులకు సరైన న్యాయం చేసి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన హితవు పలికారు. Also Read: నేడు బిగ్ బాస్ ఫైనల్స్.. విన్నర్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు! ఈ క్రమంలోనే తాడిమర్రి లో వేస్తున్న రోడ్లు ఆదాని కంపెనీ కోసం అతి చొరవ తీసుకొని వేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తి సామాజిక వర్గాల పేరుతో ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటు అన్నారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తున్న కేతిరెడ్డి.. వారి తండ్రి చనిపోయినప్పుడు ఏ దిక్కులేని పరిస్థితుల్లో ఉన్న కేతిరెడ్డి కుటుంబాన్ని ఆదుకున్నది చంద్రబాబెనని గుర్తు పెట్టుకోవాలన్నారు. Also Read: సీఎం రేవంత్ తో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ భేటీ.. కారణమిదేనా? రెడ్ డైరీ పేరు ఎత్తగానే కేతిరెడ్డి ఉలిక్కిపడుతున్నాడని విమర్శలు గుప్పించారు. అయితే, కేతిరెడ్డికి ఏమాత్రం ఉలికిపాటు తగదని.. అందులో కచ్చితంగా కేతిరెడ్డి, కేతిరెడ్డి చెంచా బ్యాచ్ పేర్లు ఉన్నాయని కావాలంటే కేతిరెడ్డికి కూడా ఆ బుక్ పంపిస్తానని ఆయన హితవు పలికారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి