Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు 5 పతకాలు సాధించింది. ఇందులో బంగారు పతకం కూడా ఉంది. ఆటల మూడో రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ ఫైనల్లో షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే ఇప్పుడు భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆర్చర్ శీతల్ దేవి 2024 పారిస్ పారాలింపిక్స్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో చిలీకి చెందిన మరియానా జునిగాతో ఆమె తలపడింది. ఈ మ్యాచ్‌లో శీతల్ దేవి కేవలం 1 పాయింట్ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
పూర్తిగా చదవండి..Paralympics 2024: ఒకే ఒక్క పాయింట్.. పారాలింపిక్స్ లో ఆర్చర్ శీతల్ దేవి కల చెదిరింది
మహిళా ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్ కల చెదిరిపోయింది. 17 ఏళ్ల ఈ ఆర్చర్ ప్రీక్వార్టర్స్ లో ఒకే పాయింట్ తేడాతో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్ రజత పతాక విజేత మరియానా 138-137తో శీతల్ ను ఓడించింది.
Translate this News: