Paralympics 2024: ఒకే ఒక్క పాయింట్.. పారాలింపిక్స్ లో ఆర్చర్ శీతల్ దేవి కల చెదిరింది 

మహిళా ఆర్చర్ శీతల్ దేవి పారాలింపిక్స్ కల చెదిరిపోయింది. 17 ఏళ్ల ఈ ఆర్చర్ ప్రీక్వార్టర్స్ లో ఒకే పాయింట్ తేడాతో ఓడిపోయింది. టోక్యో పారాలింపిక్స్ రజత పతాక విజేత మరియానా 138-137తో శీతల్ ను  ఓడించింది. 

New Update
Paralympics 2024: ఒకే ఒక్క పాయింట్.. పారాలింపిక్స్ లో ఆర్చర్ శీతల్ దేవి కల చెదిరింది 

Paralympics 2024:  పారిస్ పారాలింపిక్స్ 2024లో భారత్ ఇప్పటివరకు 5 పతకాలు సాధించింది.  ఇందులో బంగారు పతకం కూడా ఉంది. ఆటల మూడో రోజు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ SH1 ఈవెంట్ ఫైనల్‌లో షూటర్ రుబీనా ఫ్రాన్సిస్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. అయితే ఇప్పుడు భారత్‌కు పెద్ద దెబ్బ తగిలింది. ఆర్చర్ శీతల్ దేవి 2024 పారిస్ పారాలింపిక్స్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో నిష్క్రమించింది. ప్రిక్వార్టర్స్‌లో చిలీకి చెందిన మరియానా జునిగాతో ఆమె తలపడింది. ఈ మ్యాచ్‌లో శీతల్ దేవి కేవలం 1 పాయింట్ తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

శీతల్ దేవి కల 1 పాయింట్ తేడాతో బద్దలైంది

Paralympics 2024:  ఈ మ్యాచ్‌లో టోక్యో పారాలింపిక్స్ రజత పతక విజేత మరియానా 138-137తో శీతల్ దేవిని ఓడించింది. ఈ ఇద్దరు ఆర్చర్ల మధ్య గట్టి పోటీ నెలకొంది. తొలి మూడు రౌండ్ల తర్వాత ఇద్దరు సమంగా ఉన్నారు. కానీ నాలుగో రౌండ్‌లో విజేత మరియానా 1 పాయింట్ ఆధిక్యం సాధించింది. ఆమె ఐదవ రౌండ్‌లో కూడా ఈ ఆధిక్యాన్ని కొనసాగించింది, దీంతో శీతల్ దేవి 1 పాయింట్‌ తేడాతో తో మ్యాచ్‌ను కోల్పోయింది.

అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర.. 

Paralympics 2024:  కేవలం 17 ఏళ్ల ఆర్చర్ శీతల్ దేవి తన పారాలింపిక్ అరంగేట్రం మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి చేతులు లేని ఆర్చర్ అయిన శీతల్ దేవి ఆర్చరీ ర్యాంకింగ్ రౌండ్‌లో 703 పాయింట్లు సాధించి ప్రపంచ రికార్డును ధ్వంసం చేసింది. శీతల్ 720 మార్కులకు గాను 703 మార్కులు సాధించింది. దీంతో 700 పాయింట్లు సాధించిన భారత తొలి మహిళా ఆర్చర్‌గా నిలిచింది. అయితే కొంతకాలం తర్వాత టర్కీకి చెందిన ఓజ్నూర్ గిర్డి క్యూర్ కూడా 704 పాయింట్లతో శీతల్ రికార్డును బద్దలు కొట్టింది.

జమ్మూ లోని చిన్న గ్రామం నుంచి.. 

Paralympics 2024: శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ అనే చిన్న గ్రామ నివాసి. ఏడేళ్ల శీతల్‌కు పుట్టినప్పటి నుంచి రెండు చేతులు లేవు. ఆమె పుట్టుకతోనే ఫోకోమెలియా అనే వ్యాధితో బాధపడుతోంది.  కానీ, ఆమె  తన జీవితంలో స్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. శీతల్ దేవి ఒక కుర్చీపై కూర్చొని, తన కుడి పాదంతో విల్లును ఎంచుకుని, ఆపై ఆమె కుడి భుజం నుండి తీగను లాగి, దవడ బలంతో బాణాన్ని వదులుతుంది. ఆమె కళను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. శీతల్ దేవి చేతులు లేకుండా పోటీ పడుతున్న ప్రపంచంలోనే మొదటి అదేవిధంగా ఏకైక చురుకైన మహిళా ఆర్చర్ కూడా కావడం విశేషం. 

Advertisment
తాజా కథనాలు