Paris Olympics: ఒలింపిక్స్‌లో హిస్టరీ క్రియేట్.. టేబుల్‌ టెన్నిస్‌లో క్వార్టర్స్‌కు చేరిన భారత్‌!

పారిస్ ఒలింపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ టీమ్ క్వార్టర్స్‌కు చేరింది. ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించింది. దీంతో మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లు ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన తొలి మహిళ భారత ప్లేయర్లుగా రికార్డ్ క్రియేట్ చేశారు.

Paris Olympics: ఒలింపిక్స్‌లో హిస్టరీ క్రియేట్.. టేబుల్‌ టెన్నిస్‌లో క్వార్టర్స్‌కు చేరిన భారత్‌!
New Update

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌ మరో పతకం సాధించే దిశగా భారత్ దూసుకెళ్తోంది. టేబుల్‌ టెన్నిస్‌ ప్రిక్వార్టర్స్‌లో 3-2 తేడాతో రొమేనియాపై విజయం సాధించిన మనికా బాత్రా, ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు క్వార్టర్స్‌కు చేరింది. ఈ విజయంతో ఒలింపిక్స్‌లో టేబుల్ టెన్నిస్‌ మహిళల ఈవెంట్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత జట్టుగా రికార్డ్ క్రియేట్ చేసింది.

మొదట డబుల్స్‌లో ఆకుల శ్రీజ, అర్చనా కామత్‌ జోడీ అద్భుతంగా ఆడి మూడు గేమ్‌ల్లోనూ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 11-9, 12-10, 11-7తో డయాకోను, సమర ఎలిజబెటాను ఓడించడంతో భారత్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత సింగిల్స్‌ మొదటి మ్యాచ్‌లో మనికా బాత్రా చెలరేగిపోయింది. 11-5, 11-7, 11-7తో బెర్నాడెట్టేను మట్టికరిపించింది. తర్వాత రొమేనియా పుంజుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 2-2తో స్కోరును సమం చేసింది. హోరాహోరీగా సాగిన సింగిల్స్‌ రెండో మ్యాచ్‌లో శ్రీజ 11-8, 4-11, 11-7, 6-11, 8-11 ఎలిజబెటా చేతిలో పోరాడి ఓడింది. చివరకు మనికా 11-9తో మూడో గేమ్‌ను సొంతం చేసుకోవడంతో భారత్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.

#paris-olympics #quarters #indian-table-tennis
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe