Paris Olympics India Schedule : లక్ష్యసేన్ లక్ష్యం సాధించేనా? హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్.. ఈరోజు ఒలింపిక్ ఈవెంట్స్ ఇవే!

పారిస్ ఒలింపిక్స్‌లో 8 రోజుల ఆట ముగిసింది. భారత్ 3 పతకాలు సాధించి పతకాల పట్టికలో 50వ స్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ 9వ రోజు అందరి దృష్టి భారత హాకీ జట్టు, లక్ష్య సేన్  అలాగే  లోవ్లినా బోర్గోహైన్‌లపై ఉంది. భారత్ పాల్గొనే ఈవేట్స్ షెడ్యూల్ ఆర్టికల్ లో ఉంది. 

Paris Olympics India Schedule : లక్ష్యసేన్ లక్ష్యం సాధించేనా? హాకీ క్వార్టర్ ఫైనల్స్ లో భారత్.. ఈరోజు ఒలింపిక్ ఈవెంట్స్ ఇవే!
New Update

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ 2024లో 8 రోజుల ఆట తర్వాత, భారత్ (India) 3 పతకాలతో 50వ స్థానంలో కొనసాగుతోంది. అంతకుముందు రోజు భారత్ 47వ ర్యాంక్‌లో ఉండగా, రెండు రోజులుగా ఎలాంటి పతకం సాధించకపోవడంతో నష్టపోయింది. ఇప్పుడు ఈ క్రీడల మహాసంగ్రామం మరో 8 రోజులు కొనసాగుతుంది. గత రెండు రోజుల్లో భారత అథ్లెట్లు 5 మెడల్ ఛాన్స్ లను కోల్పోయారు. 8వ రోజు ఆటలో మను భాకర్ హ్యాట్రిక్ మిస్సయింది. దీపికా కుమారి, భజన్ కౌర్ కూడా ఆర్చరీలో పతక రౌండ్‌కు చేరుకోలేకపోయారు. ఇది కాకుండా, నిశాంత్ దేవ్ బాక్సింగ్‌లో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి పతకానికి ఒక్క అడుగు దూరంలో నిలిచాడు. ఇప్పుడు 9వ రోజు, లక్ష్య సేన్ - లోవ్లినా బోర్గోహైన్ వంటి పెద్ద పేర్లు ఈ రోజు మెడల్ ఆశలు రేకెత్తిస్తున్నాయి. షూటింగ్‌లో మరోసారి పతకం సాధించే అవకాశం ఉంటుంది.

భారత హాకీ జట్టు క్వార్టర్ ఫైనల్స్
Paris Olympics India Schedule : పారిస్ ఒలింపిక్స్ 9వ రోజు అతిపెద్ద మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌ గ్రూప్‌ దశలో ఆస్ట్రేలియా (Australia) ను ఓడించి భారత హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. ఇప్పుడు గ్రేట్ బ్రిటన్‌తో తలపడనున్న క్వార్టర్ ఫైనల్స్ వంతు వచ్చింది. ఆగస్టు 4వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి భారత జట్టు గెలుపొందాలనే సంకల్పంతో మరోసారి రంగంలోకి దిగనుంది.

లక్ష్య సేన్‌ రికార్డ్ సాధిస్తాడా?
9వ రోజు భారత్‌కు రెండో భారీ మ్యాచ్ బ్యాడ్మింటన్‌లో జరగనుంది. పతకం సాధించి చరిత్ర సృష్టించేందుకు లక్ష్య సేన్ (Lakshya Sen) ఒక్క అడుగు దూరంలో ఉన్నాడు. దీనికి ముందు, అతను పురుషుల బ్యాడ్మింటన్ సెమీ-ఫైనల్‌లో డెన్మార్క్‌కు చెందిన విక్టర్ అక్సెల్‌సెన్‌తో లిట్మస్ టెస్ట్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అక్సెల్‌సెన్ రెండో స్థానంలో ఉండగా, లక్ష్య 19వ స్థానంలో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో లక్ష్య గెలిస్తే ఫైనల్‌కు చేరడంతోపాటు పతకం కూడా ఖాయం అవుతుంది. అలా జరిగితే లక్ష్యసేన్  పురుషుల బ్యాడ్మింటన్ చరిత్రలో పతకం సాధించిన తొలి భారతీయుడిగా రికార్డులకెక్కనున్నాడు. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2.20 గంటల నుంచి జరగనుంది.

లోవ్లినా పతకంపై అందరి దృష్టి..
ఇప్పుడు బాక్సింగ్‌లో లోవ్లినా బోర్గోహైన్ భారత్‌కు చివరి ఆశ మిగిలివుంది. ఆదివారం ఆగస్టు 4న జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన లి కియాన్‌తో తలపడాల్సి ఉంది. లి కియాన్ టోక్యో ఒలింపిక్స్‌లో రజతం - రియో ​​ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించినందున ఈ మ్యాచ్ లో గెలుపు అంత సులభం కాదు. అయితే, కియాన్‌ను ఓడించడంలో లోవ్లినా విజయం సాధించి సంచలనం సృష్టిస్తే, ఆమె సెమీ-ఫైనల్‌కు వెళ్లి, కనీసం కాంస్య పతకాన్ని ఆమె పేరు మీద ఖాయం చేస్తుంది.

షూటింగ్‌లోనూ పతకం సాధించే అవకాశం..
పారిస్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌ ఇప్పటికే 3 పతకాలు సాధించింది. ఇప్పుడు 9వ రోజు మరో పతకం సాధించే అవకాశం ఉంది. మహిళల స్కీట్ షూటింగ్ ఈవెంట్‌లో ఆగస్టు 4 రెండో రోజు. ఇందులో భారత్ తరఫున రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ పాల్గొంటున్నారు. మొదటి రోజు తర్వాత మహేశ్వరి 8వ స్థానంలో, రైజా 25వ స్థానంలో ఉన్నారు. అర్హత కోసం మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్నాయి, అవి మధ్యాహ్నం 1 గంట నుండి జరుగుతాయి.  షూటర్లిద్దరూ టాప్-6లో చేరితే రాత్రి 7 గంటల నుంచి జరిగే ఫైనల్ మ్యాచ్‌లో పతకాలు సాధించవచ్చు.

భారత్ ఇతర మ్యాచ్‌లు
పురుషుల షూటింగ్ 25 మీటర్ల రాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్ యొక్క స్టేజ్ పోటీ 12.30 నుండి ప్రారంభమవుతుంది, ఇందులో భారతదేశం నుండి అనీష్ భన్వాలా, విజయవీర్ సిద్ధూ పాల్గొంటున్నారు. గోల్ఫ్ నాలుగో రౌండ్‌లో శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ కనిపించనున్నారు. పారుల్ చౌదరి అథ్లెటిక్స్‌లో మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో మొదటి రౌండ్‌లో అర్హత కోసం పరిగెత్తనుంది. ఇక జాసన్ ఆల్డ్రిన్ పురుషుల లాంగ్ జంప్‌లో పాల్గొనబోతున్నాడు. సెయిలింగ్‌లో విష్ణు శరవణన్, నేత్ర కుమనన్ 7, 8 స్థానాలకు పోటీ పడనున్నారు.

ఆగస్టు 4న భారత్ పాల్గొనే ఈవెంట్స్ షెడ్యూల్:

  • 12:30 PM – గోల్ఫ్ – పురుషుల ఇండివిజువల్ స్ట్రోక్ ప్లే రౌండ్ 4 – శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్
  • 12:30 PM - షూటింగ్ - 25m ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 1 - అనిష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధు
  • 1 PM – షూటింగ్ – స్కీట్ ఉమెన్స్ క్వాలిఫికేషన్ రౌండ్ 2 – మహేశ్వరి చౌహాన్, రైజా ధిల్లాన్
  • 1:30 PM – హాకీ – పురుషుల క్వార్టర్ ఫైనల్స్ – భారతదేశం vs గ్రేట్ బ్రిటన్
  • 1:35 PM – అథ్లెటిక్స్ – మహిళల 3000m స్టీపుల్‌చేజ్ రౌండ్ 1 – పరుల్ చౌదరి
  • 2:30 PM – అథ్లెటిక్స్ – పురుషుల లాంగ్ జంప్ క్వాలిఫికేషన్ రౌండ్ – జెస్విన్ ఆల్డ్రిన్
  • 3:02 PM – బాక్సింగ్ – మహిళల 75kg క్వార్టర్ ఫైనల్స్ – Lovlina Borgohain vs Li Qian (చైనా)
  • 3:30 PM – బ్యాడ్మింటన్ – పురుషుల సెమీ ఫైనల్ – లక్ష్య సేన్ vs విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)
  • 3:35 PM – సెయిలింగ్ – పురుషుల డింగీ రేస్ – విష్ణు శరవణన్
  • 4:30 PM - షూటింగ్ - 25m ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ పురుషుల క్వాల్-స్టేజ్ 2 - అనిష్ భన్వాలా, విజయ్‌వీర్ సిద్ధూ
  • 6:05 PM – సెయిలింగ్ – మహిళల డింగీ రేస్ – నేత్ర కుమనన్
  • 7 PM – షూటింగ్ – స్కీట్ ఉమెన్స్ ఫైనల్ – మహేశ్వరి చౌహాన్, రాజా ధిల్లాన్ (అర్హత సాధించినట్లైయితే..)

Also Read : శ్రీలంకతో రెండో వన్డే.. భారత జట్టులో మార్పులుంటాయా?

#paris-olympics-2024 #paris-olympics-india-schedule #lakshya-sen
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి