/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-55.jpg)
Paris Olympics: ప్యారిస్ ఒలింపిక్స్‌లో చైనాకు చెందిన యువ డైవర్లు అదరగొట్టారు. జూలై 31న జరిగిన మహిళల సింక్రనైజ్డ్ 10 మీటర్ల ప్లాట్‌ఫారమ్ ఈవెంట్‌లో అద్భుతమైన ప్రదర్శనను ప్రదర్శనతో చెన్ యుక్సీ, క్వాన్ హాంగ్‌చాన్ స్వర్ణం సాధించారు. మొదటి రెండు రౌండ్ల లోనే 15 పాయింట్ల ఆధిక్యాన్ని నెలకొల్పిన యువతులు.. గేమ్ మొత్తం ఆధిపత్యాన్ని కొనసాగించారు. ప్రపంచం విస్తుపోయేలా ఇద్దరు ఒకరిలాగే కనిపిస్తూ వేసిన డైవ్‌లు అబ్బురపరిచాయి. ప్రతి ఒక్కటి సమానంగా చేస్తూ చూపరులను మంత్రముగ్గుల్ని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి.
China's Chen Yuxi and Quan Hongchan won gold in the women's synchronized 10m platform diving event with a performance that was so synchronized and flawless, they appeared as one diver while jumping from a side view. pic.twitter.com/13GiXAYrar
— Game of X (@froggyups) August 1, 2024
నెట్టింట పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే వన మిలియన్ పైగా వ్యూస్ పొందిన వీడియో.. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. చైనీస్ డైవర్లను హృదయపూర్వకంగా అభినందిస్తు్న్నారు. క్వాన్ హాంగ్‌చాన్, చెన్ యుక్సీ ఆ రకమైన పరిపూర్ణతను సాధించడానికి చాలా సాధన చేశారని, వారి అద్భుతమైన ఫలితానికి సంవత్సరాల శిక్షణ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.