Parineeti-Raghav Wedding: మెహందీలో పరిణీతి చోప్రా ఫస్ట్ లుక్ వైరల్..!!

బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. ఆమె రాఘవ్ చద్దా వివాహం చేసుకోనుంది.వీరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు షురూ అయ్యాయి. పరిణీతి మెహందీ వేడుకను ఢిల్లీలో నిర్వహించారు. ఈ మెహందీ ఫంక్షన్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్ల వైరల్ గా మారాయి. పరిణీతి తన చేతులపై రాఘవ్ పేరు మెహందీని అలంకరించింది.

New Update
Parineeti-Raghav Wedding: మెహందీలో పరిణీతి చోప్రా ఫస్ట్ లుక్ వైరల్..!!

పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ ఎంపీ రాఘవ్ చద్దా ఈనెల 24న మూడుముళ్ల బంధంతో ఒకటి కాబోతున్నారు. ఈ ఏడాది మే నెలలో వీరి నిశ్చితార్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఆర్నెళ్లపాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ జంట..ఇప్పుడు పెళ్లి చేసుకునేందుకు ఫిక్స్ అయ్యారు. మూడుముళ్ల బంధంతో వీరిద్దరు ఒకటి కానున్నారు. ఈ తరుణంలోనే పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు మొదలయ్యాయి. మంగళవారం ఢిల్లీలో పరిణీతి చోప్రా రాఘవ్ చద్దా మెహందీ వేడుకను ఘనంగా నిర్వహించారు. వారి మెహందీ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇది కూడా చదవండి: దెబ్బతిన్న కెనడా, భారత్‌ దౌత్య సంబంధాలు..ఈ కంపెనీల్లో ఆందోళన!!

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలలో, రాఘవ్,పరిణీతి చోప్రాల ఇరు కుటుంబాలు హాజరయ్యారు. వీరి కుటుంబ సభ్యులు గురుద్వారాలో కూర్చుని ఉన్నారు. పరిణీతి చేతులపై రాఘవ్ పేరు యొక్క మెహందీ కనిపిస్తుంది. ఈ ఫోటోను పరిణీతి చోప్రో తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో షేర్ చేసింది.

publive-image CREDIT : JAGRAN

ఇక ఈ మెహందీ ఫంక్షన్ లో రాఘవ్, పరిణీతి ఇద్దరూ పాస్టెల్ పింక్ కలర్ దుస్తుల్లో మెరిసిపోయాయిరు. పరిణీతిని చూస్తుంటే భువి నుంచి దివికి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోయింది. ఆమె చేతులపై రాఘవ్ పేరు ఉన్న మెహందీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. కుటుంబ సభ్యుల సమక్షంలో వాహెగురు ఆశీస్సులు తీసుకున్నారు.

ఇది కూడా చదవండి: టర్కీ వంకర బుద్ది…యూఎన్‌జీఏలో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్ ఫ్రెండ్..!!

ఢిల్లీలో కార్యక్రమాలు పూర్తయిన తర్వాత పరిణీతి , రాఘవ్‌లు ఉదయ్‌పూర్‌కు బయలుదేరనున్నారు. వీరి వివాహం ఉదయ్ పూర్ లో జరగనుంది. 23న పరిణీతి చూర వేడుక జరగనుంది. రాఘవ్ సెహర్‌బందీ వేడుక మరుసటి రోజు అంటే 24న జరుగుతుంది. అదే రోజు మధ్యాహ్నం, రాఘవ్ తన వధువును తీసుకురావడానికి పెళ్లి ఊరేగింపును తీసుకువెళతాడు. వీరి వివాహానికి కుటుంబ సభ్యులే కాకుండా సన్నిహితులు కూడా హాజరు కానున్నారు. ఉదయపూర్‌లో పెళ్లి చేసుకున్న తర్వాత రాఘవ్-పరిణీతి చండీగఢ్‌లో గ్రాండ్ గా రిసెప్షన్ పార్టీని నిర్వహించనున్నారు. ఈయన పెళ్లికి పలువురు బాలీవుడ్ ప్రముఖులతోపాటు... రాజకీయ నాయకులు కూడా పాల్గొనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు