Parenting Guide: పిల్లల బ్రెయిన్ చాలా పదునైనది. చిన్నతనంలో పిల్లలు విషయాలను త్వరగా అర్థం చేసుకుంటారు. అయితే కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. అటువంటి పిల్లల్లో ఏకాగ్రత స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువ సేపు చదవలేకపోవడం, అర్ధం చేసుకోలేకపోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఇటువంటి పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి బ్రెయిన్ గేమ్స్ అలవాటు చేయడం ఉత్తమమైన మార్గం అని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పిల్లల ఏకాగ్రతను పెంచే ఆటలు
సుడోకు
పిల్లల బ్రెయిన్ కు పదునుపెట్టి, చదువుపై దృష్టి పెట్టడానికి ప్రతిరోజూ కొంత సమయం పాటు సుడోకు ఆడటం నేర్పండి. సుడోకు ఏకాగ్రతను పెంచడానికి ఉత్తమమైన గేమ్. దాని సహాయంతో, పిల్లలలో లాజిక్ సెన్స్, ఫోకస్ అభివృద్ధి చెందుతాయి. గణిత నైపుణ్యాలు కూడా మెరుగుపడతాయి.
చెస్
చదరంగాన్ని ఫోకస్, ఏకాగ్రతతో కూడిన ఆట అంటారు. ప్రతిరోజూ మీ పిల్లలతో చెస్ ఆడటం అలవాటు చేసుకోండి. పిల్లవాడు రోజూ ఒక గంట పాటు కూర్చుని చదరంగం ఆడడం ద్వారా చదువు పై ఏకాగ్రత పెరగడానికి సహాయపడుతుంది. ఈ గేమ్ పిల్లల జ్ఞాపకశక్తి, లాజిక్ సెన్స్, గణితాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
పజిల్
పజిల్ఇది ఒక బ్రెయిన్ గేమ్. ఈ ఆట ఆడటం వల్ల పిల్లల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లవాడు చాలా లాజిక్‌లను కూడా వర్తింపజేస్తాడు. తద్వారా చదువులో కూడా ప్రతిభను కనబరుస్తారు. పిల్లలు ఆటలు ఆడటానికి ప్రోత్సహించండి. అప్పుడే పిల్లల మైండ్ షార్ప్ అవుతుంది.
యోగా
పిల్లలతో కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలు కూడా చేయించండి. తద్వారా పిల్లల మెదడు అభివృద్ధి చెందుతుంది. ప్రతిరోజూ వృక్షాసనం, బాలాసనం, తడసానా వంటి యోగా భంగిమలను చేయించండి. ఇవి పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతాయి.