Paralympics: పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో పతకం!

పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. షాట్‌పుట్‌ F57లో హోకాటో హోటోజే సెమా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. ఫైనల్ ఈవెంట్‌లో హోకాటో 14.65 మీటర్లు విసిరి మూడవ స్థానంలో నిలిచాడు. షాట్‌పుట్‌లో పతకం సాధించిన నాల్గవ భారతీయుడు హోకాటో.

New Update
Paralympics: పారాలింపిక్స్.. భారత్ ఖాతాలో మరో పతకం!

Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం లభించింది. షాట్ పుట్ F57లో హోకాటో హోటోజే సెమా కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. శుక్రవారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో హోకాటో 14.65 మీటర్లు విసిరి మూడవ స్థానంలో నిలిచాడు. ఇరాన్‌కు చెందిన యాసిన్ ఖోస్రావి 15.96 మీటర్లతో స్వర్ణం గెలుచుకున్నాడు. 14.76 మీటర్లతో బ్రెజిల్‌కు చెందిన థియాగో పౌలినో డాస్ శాంటోస్ రెండో స్థానంతో రజతం సాధించాడు.

ఇక పారాలింపిక్స్ షాట్ పుట్‌లో పతకం సాధించిన జోగిందర్ శర్మ (1984 పారాలింపిక్స్‌లో రజతం, పురుషుల షాట్‌పుట్ L6), దీపా మాలిక్ (2016 పారాలింపిక్స్‌లో రజతం, మహిళల షాట్‌పుట్ F53), సచిన్ ఖిలారీ (2024 పారిస్ పారాలింపిక్స్‌లో రజతం, పురుషుల షాట్‌పుట్ F46) తర్వాత నాగాలాండ్‌కు చెందిన హోకాటో నాల్గవ భారతీయుడిగా నిలిచాడు. నిజానికి హోకాటో ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్ (SF)లో చేరాలని కలలు కన్నాడు. అయితే కౌంటర్ ఇన్‌ఫిల్ట్రేషన్ ఆపరేషన్ సమయంలో అతను మందుపాతర పేలుడుకు గురయ్యాడు. దీంతో అతని ఎడమ కాలు మోకాలి కిందవకరూ కోల్పోయాడు. 40 ఏళ్ల హోకాటో గత సంవత్సరం ఆసియా పారా గేమ్స్‌లో కాంస్య పతకం, 2022లో మొరాకో గ్రాండ్ ప్రిక్స్‌లో రజతం సాధించాడు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అతను నాలుగో స్థానంలో నిలిచాడు.

Advertisment
తాజా కథనాలు