Paraguayan swimmer Luana Alonso: కాస్త అందంగా కనపడితే రోడ్ల వెంట చెత్త ఏరుకునే వాళ్లను, అడుక్కునే వాళ్లను కూడా వదలరు మగాళ్లు. అందంగా కనపడితే అప్పుడే చెడ్డీలు తొడిగిన పోరగాడి నుంచి మంచం మీద నుంచి లేవలేని ముసలోళ్ల వరకు చొంగ కార్చుకుంటూ చూస్తారు. అందంగా కనిపించే సాధారణమైన అమ్మాయిలనే వదలని సమాజం.. ఇక సెలెబ్రిటీలను మాత్రం ఎందుకు విడిచిపెడుతుంది. అమ్మాయిల అందానికిచ్చే ప్రయారిటీ ప్రపంచంలో దేనికీ ఇవ్వడం లేదు. కానీ దీని కారణం నేడు ఒక మంచి స్విమ్మర్...ఇంకా చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి తన కెరీర్‌కు స్వస్తి పలికింది.
పరాగ్వేకి చెందిన లువానా అలాన్సో అనే 20 ఏళ్ల స్విమ్మర్ పారీస్ ఒలింపిక్స్‌లో తన దేశం తరపున పాల్గొనడానికి వచ్చింది. చిన్న వయసులోనే బటర్‌ప్లై ఈవెంట్లో అనేక రికార్డులు కలిగి ఉంది. టోక్యో ఒలంపిక్స్‌లో కూడా లువానా పాల్గొన్నది. కానీ పతకం దక్కలేదు. ఇక ఈ సారి ప్యారిస్ ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే పట్టుదలతో తన దేశ అథ్లెట్లతో కలిసి వచ్చింది. ఒలింపిక్ విలేజ్‌లో అందరితో పాటే కలిసి ఉన్నది. 100 మీటర్ల బటర్‌ఫ్లై కేటగిరీలో క్వార్టర్ ఫైనల్స్ కూడా గెలిచి.. సెమీస్‌కు చేరుకుంది. కానీ దురదృష్టవశాత్తు సెమీస్‌లో వెనుదిరిగింది. కానీ కథ ఇక్కడితో ఆగిపోలేదు.
ఒలింపిక్ విలేజ్‌లోనే తోటి పరాగ్వే అథ్లెట్లతో కలిసి ఉంటోంది. తనకు ఇక ఎలాంటి పోటీ లేకపోవడంతో అందరితో కలివిడిగా తిరుగుతోంది. అయితే లువానా అలాన్సో అందం కారణంగా తాము పోటీలపై కాన్సన్‌ట్రేషన్ చేయలేకపోతున్నామని తోటి పరాగ్వే మేల్ అథ్లెట్లు కంప్లైంట్ చేశారు. తన అందంతో ఆమె చాలా డిస్ట్రబ్ చేస్తోందని.. అంతే కాకుండా తమ ఏకాగ్రత దెబ్బతినేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆమె ఉంటే మేము ఆటల్లో సరిగా పాల్గొనలేమని మేనేజ్‌మెంట్‌కు చెప్పారు.
పరాగ్వే జట్టు మేనేజ్‌మెంట్ కూడా మేల్ అథ్లెట్ల మాటే విన్నది. వెంటనే విషయాన్ని తమ దేశంలో ఉన్న ఉన్నతాధికారులకు చేరవేశారు. ఇంకే ముంది.. లువానా అందం కారణంగా పరాగ్వే ఆటగాళ్లు సరైన ప్రదర్శన చేయలేకపోతున్నారని డిసైడ్ అయ్యారు. వెంటనే ఆమెను దేశానికి తట్టాబుట్టా సర్ధుకొని వచ్చేయాలని హుకుం జారీ చేశారు. వాస్తవానికి ఓడిపోయిన ఆటగాళ్లు ఒలింపిక్స్ ముగిసే వరకు విలేజ్‌లో ఉండటానికి అర్హులే. కానీ స్వయంగా పరాగ్వే టీమ్ మగ ఆటగాళ్లే కంప్లైట్ చేయడంతో ఆమెను బయటకు పంపించక తప్పలేదు.
స్విమ్మింగ్‌లో ఎంతో భవిష్యత్ ఉన్న లువానా ఈ ఘటనతో తీవ్రమైన ఆవేదన చెందింది. కేవలం 20 ఏళ్ల లువానాకు ఇంకా ఎంతో కెరీర్ మిగిలి ఉంది. కానీ తోటి అథ్లెట్ల కారణంగా స్విమ్మింగ్‌కు గుడ్ బై చెప్పింది. తాను ఇకపై దేశం తరపున ప్రొఫెషనల్ స్విమ్మింగ్ చేయనని చెప్పింది. సొంత దేశపు ఆటగాళ్లే తనపై తప్పుడు ఆరోపణలు చేసి.. తానే వారిని ఏదో చేసినట్లు పుకార్లు పుట్టించడం చాలా బాధగా ఉందని ఆమె పేర్కొన్నది. పాశ్చత్య మీడియా కూడా 'Too Hot' అంటూ తన అందాన్ని వర్ణిస్తూ వార్తలు రాయడంపై మండిపడింది. ఒక అథ్లెట్ ఆట గురించి చర్చించాలి. అంతే కానీ.. ఇలా అందంపై చర్చ చేయడం అంటే వాళ్లను అవమానించడమే అని బాధపడింది.
Also Read: Vizag : విశాఖ బీచ్‌లో ముక్కలైన ఫిషింగ్ బోటు..