NEET : పేపర్ లీకేజీ వెనుక బయటపడుతున్న నమ్మలేని నిజాలు..

రోజురోజుకూ నీట్ పేపర్ లీక్ వెనుక ఉన్న స్కామ్‌లో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా 700 మంది విద్యార్ధులు, 200-300 కోట్లు లక్ష్యంగా నీట్ రాకెట్ జరిగిందని చెబుతున్నారు. పేపర్ లీక్ వెనుక పెద్ద మాఫియా, గ్యాంగ్ ఉందని చెబుతున్నారు ఇందులో కీల సభ్యుడు అయిన బిజేందర్ గుప్తా.

NEET: రీ ఎగ్జామ్‌లో తేలిపోయిన టాపర్లు
New Update

NEET Exam Paper Leak : నీట్ పేపర్ లీకేజి ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది. దీని మీద కేంద్రం దర్యాప్తుకు అధికారులను నియమించింది. మరోవైపు సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. అయితే ఇండియా టుడే నీట్ (NEET) పేపర్ లీకేజ్ మీద ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని పెట్టింది. దీని వెనుక ఉన్న కీలక సభ్యుడిని గుర్తించింది. అతన్ని ఇంట్రాగేట్ చేసిన మీదట నమ్మలేని ఎన్నో విషయాలు బయటపడ్డాయి.

ఇండియా టుడే మాట్లాడిన కీలక సభ్యుని పేరు బిజేందర్ గుప్తా (Vijender Gupta). ఇతను గతంలో కూడా పలు పేపర్ల లీక్ కేసుల్లో చిక్కి జైలుకు కూడా వెళ్ళారు. రెండు సార్లు అరెస్ట్ అయి తప్పించుకున్నారు.పేపర్ లీక్ వ్యాపారంలో 24 సంవత్సరాలుగా, అతను 2023 ఒడిశా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (OSSC) పరీక్ష, బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సంబంధించిన కేసులలో పాల్గొన్నాడు.

ఇప్పుడు ఈ బిజేందరే నీట్ పీపర్ లీకేజ్ గురించి అన్ని వివరాలు చెబుతున్నారు. నీట్ పేర్ లీక్ అవుతుందని బిజేందర్ మార్చిలోనే అంచనా వేశారు. దానికి సంబంధించి ఓ వీడియో కూడా చేశారు. అది అప్పుడే వైరల్‌గా మారింది కూడా. అందులో టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష మరియు ఒడిశా జూనియర్ ఇంజనీర్ పేపర్ లీక్ కేసులలో ప్రస్తుతం బార్ వెనుక ఉన్న విశాల్ చౌరాసియా నీట్ పేపర‌ను లీక్ చేస్తారని చెప్పారు. దాంతో పాటూ ప్రస్తుం ఈ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితుడు, పరారీలో ఉన్న సంజీవ్ ముఖియాను కూడా పట్టుకోలేరని బిజేందర్ గుప్తా అంటున్నారు. పేపర్ లీక్ 700 మంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నదని, 200-300 కోట్ల రూపాయల రాకెట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

అంతేకాదు పేపర్ లీక్ ఎలా అవుతుంది? రవాణా టైమ్‌లో పేపర్ ఉన్న బాక్స్‌లు ఎలా విడిపోతాయి లాంట విషయాలను కూడా వివరంగా చెప్పారు బిజేందర్ గుప్తా. ఇప్పుడు పేపర్ లీక్ చేసినవాళ్ళు అరెస్ట్ అవుతారు. జైలుకు వెళతారు. మళ్లీ విడుదల అయి బయటకు వచ్చి అదే పని చేస్తారు. తాను కూడా అంత అంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు బిజేందర్. పేపర్ లీక్ చేసిన వాళ్ళు చాలా పకడ్బందీగా అనని పనులూ చేస్తారు. ఎన్టీయేలో ఉన్నవాళ్ళు అస్సలు పట్టుకోలేరు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న సంస్థలకు టెండర్లు వస్తాయని పేర్కొంటూ రవాణా సమయంలో ప్రశ్నపత్రాలు ఉన్న బాక్సులను ఎలా పగలగొడతారో కూడా ఆయన వివరించారు. లాజిస్టిక్స్ కంపెనీలు ప్రశ్నాపత్రాలను వేర్వేరు పరీక్షా కేంద్రాలకు తరలించినప్పుడు విచ్ఛిన్నం అవుతుందని గుప్తా చెప్పారు.

ఇలా పేపర్ లీక్ చేస్తున్నవాళ్ళు అన్ని రకాల కనెక్షన్లను కలిగి ఉంటారు. ప్రింటింగ్ ప్రెస్‌, పోలీసు వ్యవస్థ, న్యాయవవస్థ...ఇలా అందరితో మంచి సంబంధాలుంటాయి వారికి. అలాంటప్పుడు వారిని పట్టుకోవడం ఎవరికి సాధ్యం అవుతుందని అడుగుతున్నారు బిజేందర్. ఇంతకు ముందు బేడీ రామ్ అఅనే వ్యక్తి అతి పెద్ద పేపర్ లీక్ మాఫియా నాయకుడుగా ఉండేవారు. అతన్నెవరు పట్టుకోగలిగారు. పైగా ఇప్పుడు అతను ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌కు ఎమ్మెల్యే కూడా అంటూ చెప్పుకొచ్చారు. ఈసారి పేర్ లీకేజిలో సంజీవ్ ముఖియాదే మాస్టర్ మైండ్ ని చెప్పారు బిజేందర్. అతనితో పాటూ పేపర్ లీక్ మాఫయాలో ఉన్న ముఠా భ్యుల వివరాలను కడా తెలిపారు. సంజీవ్ ముఖియా 10 సంవత్సరాలుగా అప్పుల్లో ఉన్నాడు. దాదాపు రూ. 30 కోట్ల అప్పులు ఉన్నాయి అతనికి. దాని నుంచి అతను ఎప్పుడూ బయటపడలేదు. అంతేకాదు బిపిఎస్‌సి టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న సంజీవ్ ముఖియా కుమారుడు శివ్ కూడా నీట్ పేపర్ లీక్‌తో సంబంధం కలిగి ఉనాడు. జైలు నుంచి కూడా అతను వ్యవహరాలు నడిపించాడని బిజేందర్ తెలిపారు.

నీట్ పేపర్ లీక్ ఇలా అయింది..

పేపర్ లీక్ మాఫియా (Mafia) కు విస్తృత బృందాల నెట్‌వర్క్ ఉందని, పంపిణీ సమయంలో లీక్ జరిగిందని చెప్పారు బిజేందర్ గుప్తా.ఢిల్లీ, పాట్నాలో, మరికొన్ని ప్రదేశాలలో 300 మంది పిల్లలు ఉన్నారు. 3-4 ప్రదేశాలకు బృందాలను పంపారు. అక్కడ నుండి పేపర్ లీక్ జరిగిందని అతను వివరించాడు.మే 5న వైద్య పరీక్ష ప్రారంభానికి రెండు గంటల ముందు తనకే ప్రశ్నపత్రం అందిందని గుప్తా తెలిపారు.

#nta #neet-exam-paper-leak #paper-leak #mafia
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe