Papaya Seeds Benefits: బొప్పాయి గింజల పొడితో బాక్టీరియా పరార్..ఇంకా ఎన్నో లాభాలు హెల్తీ ఫ్రూట్స్ లిస్ట్‌లో బొప్పాయి పండు ఒకటి. రోజూ ఈ పండు తింటే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. బొప్పాయిలోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ చేస్తుంది. కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది. By Vijaya Nimma 08 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Health Tips Papaya Seeds : బొప్పాయి పండులో ఎన్నో ఔషధాలున్నాయి. బొప్పాయి పండును కొందరు పచ్చి బొప్పాయిని కూరగా చేసుకుంటారు. బొప్పాయి ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు ఈ ఆకుల రసాన్ని తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. అయితే.. ఇప్పుడు బొప్పాయి పండు, బొప్పాయి ఆకులే కాదు, బొప్పాయి గింజలు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే.. బొప్పాయి పండు కట్ చేయగానే.. ముందు అందులో ఉండే గింజలు తీసి అవతల పారేస్తారు. ఆ గింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలిస్తే వాటిని అస్సులు విసిరేయరు. బొప్పాయి గింజలపై జిగురు పదార్థం ఉంటుంది. ఇది కొద్దిగా చేదుగా, కారంగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి మిక్సీలో పొడిలా చేసి తిసుకుంటే మన శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. బొప్పాయిలో విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, జింక్, మెగ్నీషియం, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బొప్పాయి గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణుల చెబుతున్నారు. బొప్పాయి గింజలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. బొప్పాయి గింజలతో కలిగే లభాలు బొప్పాయి(Papaya) గింజల్లో ఫైబర్, ప్రోటీన్, జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి విటమిన్లు ఎక్కువ. ఈ గింజల్లో ఒలీక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ ఆరోగ్యాన్ని పెంచుతాయి. బొప్పాయి గింజలు తింటే శరీరంలో కొలెస్ట్రాల్ సాధారణ స్థాయికి తగ్గుతుంది. వీటిలో కార్పైన్ అనే పదార్థం పేగులలోని పురుగులు, బ్యాక్టీరియాను చంపుతుంది. ఈ విత్తనాలలోని అధిక ఫైబర్ పేగులు బాగా కదిలేలా చేస్తుంది. బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలం. ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. శరీర వ్యర్థాలను తొలగి త్వరగా బరువు తగ్గిపోతారు. బొప్పాయి గింజల్లో కెరోటిన్, ఈస్ట్రోజెన్ లాంటి హార్మోన్ పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తుంది. బొప్పాయి గింజల్లో విటమిన్-సి, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ మంట, నొప్పిని తగ్గిస్తాయి. బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ అనేక రకాల క్యాన్సర్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి రోజూ బొప్పాయి గింజలు, వాటిని చూర్ణం నీటిలో కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. ఇది కూడా చదవండి: గుడ్డులోని పచ్చ సొనతో కూడా ప్రయోజనాలు.. అస్సలు పడేయకండి #health-benefits #papaya-seeds మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి