/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/elr.jpg)
Panchayat Secretary : వీధి వ్యాపారిపై పంచాయితీ సెక్రటరీ రెచ్చిపోయాడు. పశ్చిమగోదావరి జిల్లా (West Godavari) సిద్ధాంతం గ్రామంలో ఈ ఘటన జరిగింది. కేజీ నేరేడు పండ్లు (Apricots) 50 రూపాయలకు ఇవ్వనందుకు వీధి వ్యాపారిపై దౌర్జన్యం చేశాడు. వ్యాపారి తోపుడు బండి మీద వున్న కాటా తీసుకెళ్ళిపోయిన సెక్రటరీ.. రోడ్డుపై వ్యాపారం ఎలా చేస్తవో చూస్తానంటూ బెదిరించాడు. రోడ్డు మీద వ్యాపారం చేసుకోవడానికి నీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటూ తోపుడు బండి వ్యాపారిపై వాగ్వివాదానికి దిగాడు.
Also Read : రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు నీతులు పలకడం హాస్యాస్పదం: పురంధేశ్వరి