Palnadu : పల్నాడు జిల్లా హై సెన్సిటివ్ అన్నారు జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ (Mallika Garg). జిల్లాలో 150 సమస్యాత్మక గ్రామాలు గుర్తించినట్లు తెలిపారు. 1666 మంది ట్రబుల్ మాంగర్స్ (Trouble Mongers) గుర్తించామని..150 కేసులు నమోదు చేశామని తెలిపారు. మాచర్ల, నరసరావుపేటలో ఎక్కువ అరెస్టులు చేశామన్నారు. బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: మద్యపాన నిషేధం.. ఈ హామీ వెనుక ఉన్న అసలు కథ ఇదే.!
బైండోవర్ అయిన వారితో ఎమ్మార్వో (MRO) కు డబ్బులు కట్టించామని.. కౌంటింగ్ రోజున (Counting Day) జిల్లాలో ఉన్న పోలీసులందరూ బందోబస్తులో ఉంటారని వెల్లడించారు. ఏపీ ఎస్పీ, సిఐఎస్ఎఫ్ బలగాలు అందులో అందుబాటులో ఉంటాయని కామెంట్స్ చేశారు. కౌంటింగ్ సెంటర్లో మాత్రమే కాకుండా సమస్యాత్మక గ్రామాలలో కూడా భారీ బందోబస్తు ఉంటుందని స్పష్టం చేశారు. పబ్లిక్ భద్రత కోసమే పోలీసులు ఉన్నారన్నారు.