Pallavi Prashanth: "ప్రాణం పోయినా మాట తప్పను".. పల్లవి ప్రశాంత్ చేసిన పనికి షాకైన నెటిజన్లు..!

బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తాను గెలుచుకున్న రూ. 35 లక్షల విన్నింగ్ అమౌంట్ పేద రైతులకు పంచుతానని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా ఓ రైతు కుటుంబానికి లక్ష రూపాయల సాయం చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. మిగతా డబ్బు కూడా పేద ప్రజల కోసం వాడతానని తెలిపాడు ప్రశాంత్.

New Update
Pallavi Prashanth: "ప్రాణం పోయినా మాట తప్పను".. పల్లవి ప్రశాంత్ చేసిన పనికి షాకైన నెటిజన్లు..!

Pallavi Prashanth: రైతు బిడ్డగా బిగ్ బాస్ సీజన్ 7 లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ విజేతగా గెలిచి.. సంచలనం సృష్టించాడు. బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా గెలిచిన ప్రశాంత్.. రూ. 35 లక్షలు క్యాష్ ప్రైజ్, 25 లక్షలు విలువ చేసే డైమండ్ నెక్లెస్, ఒక కారు గెలుచుకున్నాడు.

Also Read : Venkatesh Daughter’s Marriage : ఘనంగా వెంకటేష్ చిన్న కూతురి పెళ్లి.. వైరలవుతున్న ఫొటోలు

ఈ సందర్భంలో తన విన్నింగ్ అమౌంట్ అంతా పేద రైతుల కోసం ఖర్చు చేస్తానని ప్రశాంత్ హామీ ఇచ్చాడు ప్రశాంత్. అయితే సీజన్ పూర్తయ్యి మూడు నెలలు కావస్తున్న దాని గురించి ఊసేలేకపోవడంతో ప్రశాంత్ పై తెగ విమర్శలు వచ్చాయి. షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు.. మాట తప్పాడు అంటూ ట్రోల్ చేశారు. ఇక ఈ రూమర్స్ ను తిప్పికొట్టేలా.. తన తొలి సహాయం చేశాడు ప్రశాంత్. ఓ పేద కుటుంబానికి అండగా నిలిచాడు.

మాట నిలబెట్టుకున్న బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్

గజ్వేల్ లోని కొలుగూరి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేశాడు. అంతే కాదు ఏడాదికి సరిపడ బియ్యం కూడా అందజేశాడు. ప్రశాంత్ కు తోడుగా సందీప్ మాస్టర్ కూడా 25 వేల రూపాయల సాయం అందించాడు. ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు ప్రశాంత్. "మీ ప్రోత్సాహంతో ఇలాంటివి మరిన్ని చేస్తానని.. తాను గెలుచుకున్న మిగతా డబ్బు కూడా పేద ప్రజల కోసమే వాడతానని తెలిపాడు".

Also Read: Tamanna: రస్నా బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నా.. వైరలవుతున్న యాడ్ షూట్

Advertisment
Advertisment
తాజా కథనాలు