Pakistan: ఇమ్రాన్‌ ఖాన్ నిర్దోషి.. పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు!

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ కు ఊరట లభించింది. 2022లో చోటుచేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్‌ మార్చ్‌’ విధ్వంసం ఘటన కేసుల్లో ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. దీంతోపాటు మరికొన్ని కేసుల్లోనూ ఇమ్రాన్ కు ఊరట కలిగించింది న్యాయస్థానం.

New Update
Pakistan: ఇమ్రాన్‌ ఖాన్ నిర్దోషి.. పాకిస్థాన్ కోర్టు సంచలన తీర్పు!

Pakistan Court Acquits Imran Khan Cases: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ కు ఊరట లభించింది. 2022లో చోటుచేసుకున్న ప్రభుత్వ వ్యతిరేక ‘లాంగ్‌ మార్చ్‌’ (Long March) విధ్వంసం ఘటన కేసుల్లో ఆయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. అంతేకాదు ఇస్లామాబాద్‌లోని లోహి భైర్, సహలా పోలీస్ స్టేషన్లలో నమోదైన వేర్వేరు కేసుల్లో ఇమ్రాన్ కు ఊరటకలిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఇమ్రాన్ ఖాన్‌పై దాఖలైన పరువునష్టం కేసును కూడా పాకిస్థాన్ కోర్టు కొట్టివేసింది. 

సమాచారం కూడా ఇవ్వకుండా కేసులు..
ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నయీ పంజోథా.. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) నేతపై ఒకే రోజు అనేక కేసులు అక్రమంగా ఫైల్ చేశారని చెప్పారు. సెక్షన్‌ 144 కింద నిషేధాజ్ఞలకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్‌ జారీ చేయలేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా కేసులు పెట్టారని న్యాయస్థానికి వివరించారు. అలాగే ఫిర్యాదుదారుడు పోలీస్‌స్టేషన్‌ ఇన్‌చార్జి అని, కేసు నమోదు చేసే అధికారం ఆయనకు లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఇక ఇమ్రాన్‌ఖాన్‌పై దాఖలైన కేసుల్లో ఏ సాక్షి వాంగ్మూలం లేదని తెలిపారు.

ఇది కూడా చదవండి: Hyderabad: నీకు దమ్ముంటే ఆ పని చేయ్.. రేవంత్‌కు ఈట‌ల స‌వాల్!

మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌..
ఇక ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని రావల్పిండిలోని అడియాలా జైలులో ఖైదిగా ఉన్నారు. ఆయన తోషాఖానా, ఇద్దత్ (ఇస్లామేతర వివాహం), ప్రభుత్వ రహస్య పత్రాల లీక్ తదితర కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారు. 2022లో అధికారం కోల్పోయిన అనంతరం మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ ఇమ్రాన్‌ ఖాన్‌ ‘లాంగ్‌ మార్చ్‌’ చేపట్టారు. ఈ సమయంలో ఇమ్రాన్ ఖాన్‌పై దాడి జరిగింది. ఆ కేసుపైనే మంగళవారం తుది విచారణ జరగగా ఇమ్రాన్ ను కోర్టు నిర్దోషిగా తేల్చింది.

Advertisment
తాజా కథనాలు