/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/pakisthan-jpg.webp)
Pakistan: ఓ పాకిస్థాన్ కమాండో పారా గ్లైడింగ్ చేస్తూ మైదానంలో దిగేందుకు బదులు, విన్యాసాలను తిలకిస్తున్న ప్రముఖుల గ్యాలరీలోకి దూసుకెళ్లాడు. దాంతో కొందరు భయంతో పక్కకి దూకేశారు. కొందరు మాత్రం గాయాలపాలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Pakistan Army elite SSG commandos landed on audience injuring public while attempting to land after para jump in occupied Gilgit-Baltistan pic.twitter.com/CP5wBtNXpO
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 3, 2023
భారత్ కు పోటీనిచ్చే సైనిక శక్తిని సముపార్జించుకోవాలన్నది పాక్ లక్ష్యాల్లో ఒకటి! కానీ, ఈ వీడియో చూస్తే.. భారత సైన్యానికి పాక్ దరిదాపుల్లో కూడా ఉండదన్న విషయం స్పష్టమవుతుంది. గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు పారా గ్లైడింగ్ విన్యాసాలు చేపట్టారు. ఈ విన్యాసాలు చూసేందుకు ప్రముఖులు, ప్రజలు విచ్చేశారు. అయితే, ఈ విన్యాసాల్లో జరిగిన సంఘటన వైరల్ గా మారింది. ఓ పాకిస్థాన్ కమాండో పారాచ్యూట్ ను నియంత్రించలేక విన్యాసాలను తిలకిస్తున్న ప్రముఖులపైకి దూసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన కొందరు అక్కడి నుండి పరిగెత్తారు.
Also Read: పండుగ షాపింగ్ కోసం లోన్ తీసుకుంటున్నారా? ఈ విషయాలపై ఓ లుక్కేయండి..
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ సైన్యంలోని అత్యుత్తమ స్థాయి కమాండో బృందం అయిన ఎస్ఎస్ జీ యోధుల పరిస్థితే ఇలా ఉంటే, సాధారణ సైనికులు ఇంకెంత ఘనులో అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. వీళ్ల కంటే హమాస్ మిలిటెంట్లు నయం.. పారా గ్లైడింగ్ చక్కగా చేస్తారు అంటూ ఓ నెటిజన్ ఎత్తిపొడిచాడు. బహుశా అవి చైనా పారాచ్యూట్లు అయ్యుంటాయి అని మరో వ్యక్తి కామెంట్ చేయగా.. వీళ్లు అత్యుత్తమ కమాండోలు ఏంట్రా బాబూ అంటూ ఇంకో నెటిజన్ విమర్శించాడు.