Pakistan: డిసెంబర్‌ నాటికి పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..

ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను విడుదల చేస్తామని స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ పాకిస్థాన్ గవర్నర్‌ జమీల్ ప్రకటించారు. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను విడుదల చేస్తామన్నారు.

New Update
Pakistan: డిసెంబర్‌ నాటికి పాలిమర్ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..

ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న దాయాదీ దేశం పాకిస్థాన్‌ ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటోంది. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు పాక్‌ ప్రభుత్వం కూడా గట్టిగానే చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా.. మెరుగైన భద్రత, హోలోగ్రామ్‌ ఫీచర్‌ల కోసం కరెన్సీ నోట్లను రీడిజైన్ చేస్తూనే పాలిమర్ ప్లాస్టిక్‌ కరెన్సీ నోటుతో ప్రయోగాలు చేస్తోంది. ఇస్లామాబాద్‌లోని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సెనేట్ కమిటీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్‌ పాకిస్థాన్ గవర్నర్‌ జమీల్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్లను నూతన భద్రతా ఫీచర్లతో రీడిజైన్ చేయనున్నాం. రూ.10, 50, 100, 500, 1000, 5000 డినామినేషన్లలో కొత్తగా రీడిజైన్ చేసిన నోట్లను డిసెంబర్‌లో విడుదల చేస్తాం.

Also Read: ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో చెప్పండి.. తేల్చేద్దాం: పొన్నం

కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక.. పాత నోట్లు ఐదేళ్ల వరకు చలామణిలో ఉంటాయి. మొదటగా ప్రజల కోసం ఒక డినామినేషన్ పాలిమర్ ప్లాస్టిక్ నోట్‌ను విడుదల చేస్తాం. ఆ తరువాత వచ్చే స్పందనను బట్టి ఇతర డినామినేషన్లలో ప్లా్స్టిక్ కరెన్సీని అందిస్తామని'' బ్యాంక్ గవర్నర్ జమీల్.. సెనేట్ కమిటీ సభ్యులకు తెలియజేశారు.

పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను వినియోగించడం కొత్త పద్ధతేమి కాదు. ఇప్పటికే 40 దేశాలు ఈ పాలిమర్ ప్లాస్టిక్ నోట్లను వినియోగిస్తున్నాయి. వీటిని డూప్లికేట్ చేయడం అస్సలు సాధ్యం కాదు. వాస్తవానికి పాలిమర్ ప్లాస్టిక్‌ నోట్లను 1998లో మొదటిసారిగా ఆస్ట్రేలియాలో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత మిగతా దేశాలు కూడా ప్లాస్టిక్ నోట్లను విడుదల చేయడం ప్రారంభించాయి. ఇప్పుడు వీళ్ల జాబితాలో పాకిస్థాన్ కూడా చేరనుంది. మరి ఇండియాలో ప్లాస్టిక్ కరెన్సీ ఎప్పుడు అనేదానిపై ఇంకా చర్చ మొదలుకాలేదు. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Also Read: ఎన్‌ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత.. క్లారిటీ ఇచ్చిన రంగనాథ్

Advertisment
తాజా కథనాలు