Imran Khan : నా భార్య ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలుపుతున్నారు : ఇమ్రాన్ ఖాన్

ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అన్నారు. ఆహారం తీసుకున్న వెంటనే ఆమె కడుపు నొప్పితో బాధపడుతున్నారని.. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు.

New Update
Imran Khan : నా భార్య ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలుపుతున్నారు : ఇమ్రాన్ ఖాన్

Toilet Cleaner : ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్థాన్(Pakistan) మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్(Imran Khan) సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుష్రా బీబీకి టాయిలెట్‌ క్లీనర్ కలిపిన ఆహారం ఇస్తున్నారని అన్నారు. ఆహారం తీసుకున్న వెంటనే ఆమె కడుపు నొప్పి(Stomach Ache) తో బాధపడుతున్నారని.. రోజురోజుకు ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిపారు. 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసుపై శుక్రవారం రావల్పిండి జైలు వద్ద కోర్టులో విచారణ జరిగింది. తన భార్యకు సరైన వైద్య పరీక్షలు(Medical Tests) చేయించడం లేదని.. ఆమె ఎవరితో కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా అదనంగా బ్యారెల్స్ ఏర్పాటు చేశారని ఇమ్రాన్‌ ఖాన్‌ కోర్టుకు తెలిపారు.

Also Read:  సీఎం జగన్‌పై దాడి కేసులో ట్విస్ట్..అతనికి సంబంధం లేదు

విచారణలో ఉన్నప్పుడు మీడియాతో మాటలు తగ్గించుకోవాలని ఇమ్రాన్‌ ఖాన్‌కు న్యాయమూర్తి సూచనలు చేశారు. తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నందు వల్ల స్పష్టత కోసం తాను వారితో మాట్లాడుతున్నట్లు ఇమ్రాన్‌ ఖాన్ వాదించారు. అలాగే ఇమ్రాన్ ఖాన్, అతడి భార్య బుష్రా బీబీకి రెండు రోజుల్లో ప్రైవేటు ఆస్పత్రిలో ఎండోస్కోపీ పరీక్ష నిర్వహించాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.

Also Read: వాట్సాప్​, ఫేస్‌బుక్, ఇన్​స్టా యూజర్ల కోసం అదిరిపోయే ఫీచర్‌..

Advertisment
తాజా కథనాలు