విరిగిన కేబుల్ కారు.... గాల్లో ఎనిమిది మంది ప్రాణాలు...!

పాకిస్తాన్‌లోని ఓ లోయను దాటుతుండగా కేబుల్ కారులో ఎనిమిది మంది చిక్కుకున్నారు. లోయను దాటే క్రమంలో కేబుల్ కారు విరిగి పోవడంతో వాళ్లంతా అందులో ఇరుక్కు పోయారు. కేబుల్ కారులో ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాళ్లంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దేవున్ని ప్రార్థిస్తున్నారు

New Update
విరిగిన కేబుల్ కారు.... గాల్లో ఎనిమిది మంది ప్రాణాలు...!

పాకిస్తాన్‌లోని ఓ లోయను దాటుతుండగా కేబుల్ కారులో ఎనిమిది మంది చిక్కుకున్నారు. లోయను దాటే క్రమంలో కేబుల్ కారు విరిగి పోవడంతో వాళ్లంతా అందులో ఇరుక్కు పోయారు. కేబుల్ కారులో ఆరుగురు చిన్నారులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వాళ్లంతో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని దేవున్ని ప్రార్థిస్తున్నారు. సమాచారం అందుకున్న అందుకున్న అధికారులు రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టారు.

కైబర్ ఫక్తుంక్తా ప్రావిన్సులో స్కూల్ కు వెళ్లాలంటే విద్యార్థులు ఓ లోయను దాటాల్సి వుంటుంది. విద్యార్థులు రోజూ కేబుల్ కారులో ఆ లోయను దాటుతూ వుంటారు. తాజాగా వారు లోయను దాటుతుండగా చైర్ కారు విరిగి పోయింది. దీంతో వాళ్లంతా లోయలో 1200 అడుగుల ఎత్తులో కేబుల్ కారులో చిక్కుకు పోయారు. ప్రమాదం జరిగిన కొద్ది సేపటిక స్థానికులు గుర్తించి సమాచారాన్ని అధికారులకు అందజేశారు.

ఉదయం 7 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. వారిని రెస్క్యూ చేయాలని అధికారులను ఆపద్దర్మ ప్రధాని ఆదేశించారు. తమను రక్షించాలంటూ కేబుల్ కారులోని ఓ వ్యక్తి తమకు సమాచారం అందించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. సుమారు ఆరు గంటలుగా తాము గాలిలో వేళాడుతున్నామని చెప్పారు. పరిస్థితి చాలా తీవ్రంగా వుందన్నారు .ఇప్పటికే కేబుల్ కారులో ఓ వ్యక్తి మూర్చ పోయాడని వెల్లడించారు. కేబుల్ కారులో పిల్లలు కూడా వున్నారని చెప్పారు.

ఆ ప్రాంతానికి ఓ హెలికాప్టర్ కూడా వచ్చిందన్నారు. అయితే ఎలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టకుండానే వెళ్లిపోయిందన్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలికాప్టర్, కమాండోలను పంపినట్టు అధికారులు తెలిపారు. అయితే లోయలో బలమైన గాలులు వీస్తుండటంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం కష్టతరంగా వుందని అధికారులు చెబుతున్నారు.

కేబుల్ కారులో చిక్కుకున్న వారిలో ఆరుగురు పిల్లలు వున్నారని, వారి వయస్సు పది నుంచి 16 ఏండ్లు వుంటుందని అధికారులు చెప్పారు. కేబుల్ కార్ల కింద వలలు ఏర్పాటు చేసి వారిని రక్షించేందుకు ప్లాన్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లి దం డ్రులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. తమ పిల్లలను ఎలాగైనా రక్షించాలని అధికారులను ప్రాదేయ పడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు