పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు షాక్ తగిలింది. తోఫ్ ఖానా కేసులో ఇస్లామాబాద్ కోర్టు తీర్పును హైకోర్టు రద్దు చేసిన సంతోషం ఎంతో సేపు నిలవలేదు. తీర్పు వెలుపడిన కొన్ని గంటల్లోనే సైపర్ కేసులో విచారణ కోసం ఇమ్రాన్ ఖాన్ జైలు కస్టడీని పాకిస్తాన్ కోర్టు మరో రెండు వారాల పాటు పొడిగించింది. అటాక్ జైలులో ఈ రోజు విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు ఈ మేరకు కస్టడీని పొడిగించింది.
పాక్ సంబంధించిన కీలక రహస్యాలను లీక్ చేశారని ఆయనపై ఆరోపణలు వున్నాయి. ఈ క్రమంలో ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన కస్టడీని రెండు వారాల పాటు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు విషయాన్ని ఇమ్రాన్ ఖాన్ తరఫు న్యాయవాది నయిమ్ పంజీత తెలిపారు. ఈ కేసులో బెయిల్ కోసం ఇమ్రాన్ ఖాన్ దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు.
also read:బిల్కీస్ భానో… మహిళా రెజ్లర్లకు బీజేపీ రాఖీ కట్టాలి…!
బెయిల్ పిటిషన్ పై సెప్టెంబర్ 2న విచారణ జరుగుతుందని చెప్పారు. గత ఏడాది ఏప్రిల్ లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి ఇమ్రాన్ ఖాన్ తన ప్రధాన పదవిని కోల్పోయారు. ఆ తర్వాత ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఇటీవల పాక్ కు విదేశీ ప్రముఖులు ఇచ్చిన విలువైన బహుమతులను ఆయన విక్రయించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
also read:ఈ ఏడాది నుంచే కామన్ సివిల్ కోడ్… సీఎం కీలక వ్యాఖ్యలు…!
ఈ కేసులో ఆయనకు మూడేండ్ల జైలు శిక్ష పడింది. దీంతో పాటు ఐదేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనపై ఆంక్షలు విధించారు. తాజాగా ఈ కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలవుతారని అంతా భావించారు. కానీ తాజాగా ఆయన కస్టడీని పొడిగించడం గమనార్హం.