Sakini Ramchandraiah : పద్మ శ్రీ అవార్డ్ గ్రహిత మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు!

'పద్మ శ్రీ అవార్డ్ 2022' గ్రహీత సకిని రాంచంద్రయ్య ఇక లేరు. ఆయన తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వాడిగా రాంచంద్రయ్య గుర్తింపు పొందారు.

Sakini Ramchandraiah : పద్మ శ్రీ అవార్డ్ గ్రహిత మృతి.. నివాళులు అర్పించిన ప్రముఖులు!
New Update

Telangana : పద్మ శ్రీ అవార్డ్ (Padma Shri Award) గ్రహీత సకిని రాంచంద్రయ్య (Sakini Ramachandraiah) కన్నుమూశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం బావి కూనవరం గ్రామనికి చెందిన ఆయన తీవ్ర అనారోగ్యంతో స్వగృహంలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కంచుమేళం - కంచుతాళం వాయిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారుల్లో చిట్టచివరి వాడిగా రాంచంద్రయ్యకు గుర్తింపు పొందారు. అలాగే మేడారం జాతర (Medaram Jatara) లో ప్రథాన ఘట్టమైన చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెలపైకి తరలించే సమయంలోనూ రాంచంద్రయ్య కీలక పాత్ర పోషించారు. ఇక రాంచంద్రయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు సోషల్ మీడియా (Social Media) వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ఈ క్రమంలోనే తన ప్రతిభను గుర్తించిన కేంద్రం 2022లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. అదనంగా కోటి రూపాయల నజరానా ప్రకటించింది. గత తెలంగాణ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో 426 గజాల ఇంటిస్థలం కేటాయించింది. కానీ రాంచంద్రయ్యకు నేటికీ నజరానా, ఇంటి స్థలం అందలేదని స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వానికి రాంచంద్రయ్య ఎన్నోసార్లు వినతులు ఇచ్చాడని, ఆయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో అనారోగ్యం బారినపడి ఆవేదనతో కొంతకాలంగా మంచంపట్టి చివరికి చనిపోయారంటూ వాపోతున్నారు.

Also Read : హైదరాబాద్–విజయవాడ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

#passed-away #sakini-ramachandraiah #padma-shri-award-2022
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe