Minister RK Roja: విజయవాడలో పద్మ భూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు

New Update
Minister RK Roja: విజయవాడలో పద్మ భూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు

జయంతి వేడుకలు

విజయవాడలో పద్మ భూషణ్ బోయి భీమన్న జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఆర్కే.రోజా, బోయి భీమన్న సతీమణి బోయి హైమావతి, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, అధికారభాషా సంఘం అధ్యక్షులు పి.విజయ్ బాబు,రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి సమితి చైర్ పర్సన్ వంగపండు ఉషారాణి హాజరైయ్యారు.

తెలుగు వారు కావడం మన అదృష్టం

ప్రముఖ రచయిత కత్తిమండ ప్రతాప్ కుమార్, మద్రాస్ యూనివర్శిటీ తెలుగు శాఖాధిపతి ప్రొ.డా.విస్తలి శంకరరావుకు పద్మ భూషణ్ బోయి భీమన్న పురస్కారాలు అందజేశారు. పురస్కార గ్రహీతలను ఘనంగా మంత్రి రోజా, పద్మభూషణ్ బోయి భీమన్న సతీమణి బోయి హైమావతి సత్కరించారు. వైఎస్సార్ చేతుల మీదుగా బోయి భీమన్న పీఠం ఏర్పాటు చేశారు. బోయి భీమన్న స్వస్థలంలో స్మారక భవనం ఏర్పాటు వైఎస్సార్ చేసింది. తండ్రికి తగ్గ తనయుడు జగన్ మోహన్ రెడ్డి వారు గుర్తు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనా దక్షుడు ... మనసున్న మంచి మనిషి అని మంత్రి రోజా అన్నారు. బోయి భీమన్న పాలేరు నాటకం ద్వారా సమాజంలో చైతన్యం తెచ్చారని ఆమె గుర్తు చేశారు. బోయి భీమన్న పేరిట పురస్కారాలను అందజేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఆర్కే రోజా. బోయి భీమన్న మన తెలుగు వారు కావడం మన అదృష్టం అన్నారు. తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన వ్యక్తి బోయి భీమన్న రోజా వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌కి కృతజ్ఞతలు

అవార్డులు, ప్రచారం కోసం బోయి భీమన్న రచనలు చేయలేదన్నారు. సమాజంలో సమస్యలను ఎలుగెత్తి చెప్పడానికి బోయి భీమన్న తన రచనలను ఆయుధంగా ఎంచుకున్నారని ఆమె వర్ణించారు. బోయి భీమన్న రచనలు ఈతరం వారు కచ్చితంగా చదవాలన్నారు. మరింత మందిని ప్రోత్సహించేందుకే బోయి భీమన్న పేరిట పురస్కారాలు అందజేస్తున్నాం అన్నారు. బోయి భీమన్న పురస్కారాలు అందజేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. బోయి భీమన్న స్పూర్తితో మరింత మంది రచనలు చేయాలని ఆశిస్తున్నాం మంత్రి రోజా పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు