Mangalavaram OTT Release: ఓటీటీలోకి మిస్టరీ త్రిల్లర్..'మంగళవారం' స్ట్రీమింగ్ డేట్ ఇదే..?

పాయల్ రాజపుత్ ప్రధాన పాత్రలో నటించిన మిస్టరీ త్రిల్లర్ 'మంగళవారం'. నవంబర్ 17న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈ చిత్రం OTT వేదికగా అలరించేందుకు సిద్ధమైంది. ఈ నెల 26 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కానుంది.

Mangalavaram OTT Release: ఓటీటీలోకి మిస్టరీ త్రిల్లర్..'మంగళవారం' స్ట్రీమింగ్ డేట్ ఇదే..?
New Update

Mangalavaaram OTT Release : మిస్టరీ త్రిల్లర్ గా తెరెకెక్కిన మంగళవారం(Mangalavaaram) ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వినిపించినప్పటికీ సినిమా ఊహించిన విజయాన్నే సాధించింది. RX 100 బ్యూటీ పాయల్ రాజపుత్(Payal Rajput) కథానాయికగా ప్రధాన పాత్రలో నటించింది. అజయ్ భూపతి(Ajay Bhupathy) దర్శకత్వం వహించారు. ఈయన మొదటి సినిమా RX 100 మంచి విజయాన్ని సాధించింది. ఆ తర్వాత సిద్దార్థ్, శర్వానంద్ హీరోలుగా తెరకెక్కించిన 'మహాసముద్రం' ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. లేటెస్ట్ గా విడుదలైన 'మంగళవారం' సినిమా అజయ్ భూపతికి మంచి విజయాన్ని అందించినది.

Also Read: RaviTeja Venky: రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. ‘వెంకీ’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

రిలీజ్ కు ముందే సినిమా ట్రైలర్, టీజర్ ఆసక్తిగా కనిపించడంతో ప్రేక్షకులలో సినిమా పై అంచనాలను పెంచింది. అంచనాలకు తగ్గట్లే నవంబర్ 17 న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. థియేటర్స్ లో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 26 న విడుదల కానుంది. మహాలక్ష్మిపురంలో గ్రామ దేవత మాలచ్ఛమకు ఇష్టమైన మంగళవారం రోజు వరుసగా హత్యలు జరుగుతాయి. ఇవి ఆత్మ హత్యల? హత్యలా? వీటి వెనుక ఉన్న కారణమేంటి? ఈ హత్యలకు ఊరి నుంచి వెలేసిన శైలజకు(పాయల్ రాజ్ పుత్) ఉన్న సంబంధం ఏంటీ అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది.

publive-image

ఈ సినిమాలో అజయ్ ఘోష్, నందిత శ్వేతా, దివ్య పిళ్ళై ప్రధాన పాత్రలో కనిపించారు. మంగళవారం చిత్రం తెలుగుతో పాటు కన్నడ, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతికి కూడా ఈ సినిమా మంచి పేరును తెచ్చి పెట్టింది.

Also Read: Bubblegum Song: రోషన్ కనకాల బబుల్ గమ్..’ఈజీ పీజీ’ లిరికల్ సాంగ్ వీడియో

Also Read: RaviTeja Venky: రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్‌.. ‘వెంకీ’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?

#payal-rajput #mangalavaram-movie #mangalavaram-ott-release
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి