/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-28-4-jpg.webp)
Paarijatha Parvam Movie: చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్ (Shraddha Das), మాళవిక సతీశన్, హర్ష చెముడు (Harsha Chemudu) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం 'పారిజాత పర్వం'. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహించారు. వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మించారు. ఇటీవలే శ్రద్ధ, సునీల్ (Sunil), చైతన్య రావు పాత్రలను పరిచయం చేస్తూ విడుదలైన మూవీ టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. సరి కొత్త క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
తిరుమలను దర్శించుకున్న 'పారిజాత పర్వం' టీమ్
అయితే రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు చిత్ర యూనిట్. విఐపి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని ఆశీషులు అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నటుడు హర్ష చెముడు.. సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. శ్రీవారి బ్లెస్సింగ్స్ కోసం వచ్చామని తెలిపారు . అలాగే మూవీ మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నామని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
Tirupati🙏 Paarijatha parvam promotions !
Wearing : @saundhindia
Make up : @raashikashetty
Hair : @arbazshaikh6210
Jewellery : @sangeetaboochra
Styling : @baharberii #tirupati pic.twitter.com/i0AFRW5glp— Shraddha das (@shraddhadas43) March 31, 2024