Pithani Balakrishna Resigned to Janasena: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేనకు బిగ్ షాక్ తగిలింది. పార్టీలో కీలకనేతగా ఉన్న పితాని బాలకృష్ణ ఎన్నికల వేళ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జనసేన (Janasena) క్రీయాశీల సభ్యత్వానికి రాజీనామా చేశారు.
వైసీపీ తీర్థం..
ఈ మేరకు కొంతకాలంగా పార్టీలో చురుకుగా పనిచేస్తున్న బాలకృష్ణకు ముమ్ముడివరం టికెట్ కేటాయించలేదు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన పితాని.. జనసేనాతో తెగదెంపులు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే రేపు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నట్లు వైసీపీ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇది కూడా చదవండి: Hyderabad: బీఆర్ఎస్ ఓటమికి అదే కారణం.. నన్ను ఎవరూ ఆపలేరు: కేకే
కోట్ల ఆస్తులు అమ్ముకున్నా..
అలాగే ముమ్మిడివరం నుంచి పోటీచేస్తున్న పొన్నాడ సతీష్ ను గెలిపించాలి పితాని పిలుపునివ్వడవం విశేషం. ఉమ్మడి తూ.గో. జిల్లాలో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తా. కాకినాడ మాజీ మేయర్ సరోజతో కలిసి పని చేస్తా. జనసేన అంటే కాపుల పార్టీ అని నిజం చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ నన్ను పిలిచి పదవి ఇస్తామన్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ ఆఫర్ ను తిరస్కరించా. ప్రజలకు సేవ చేయడానికి కోట్ల ఆస్తులు అమ్ముకున్నా. పవన్ ని దేవుడని నమ్మినా.. మాకు ఒక్క సీటు ఇవ్వలేదంటూ పితాని వివరించారు.