కేసీఆర్ మిత్రధర్మాన్ని తప్పారు, బీఆర్ఎస్ ను ఓడించటమే మా ఎన్నికల నినాదం: సీపీఐ, సీపీఎం

ముఖ్యమంత్రి కేసీఆర్ పై కమ్యూనిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రధర్మం మరిచి ఏకపక్షంగా అభ్యర్థుల్ని ప్రకటించారని ధ్వజమెత్తారు.కేసీఆర్ ఏంటనే విషయం ఇప్పుడు తెలిసిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ నిర్ణయంపై చాలా మంది కలత చెందారని అన్నారు. బీఆర్‌ఎస్‌ను ఓడించాలన్నదే తమ ఎన్నికల నినాదం అని స్పష్టం చేశారు.

కేసీఆర్ మిత్రధర్మాన్ని తప్పారు, బీఆర్ఎస్ ను ఓడించటమే మా ఎన్నికల నినాదం: సీపీఐ, సీపీఎం
New Update

తెలంగాణ సీపీఐ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. మునుగోడులో బీఆర్ఎస్ ను గెలిపించాం, ఇప్పుడు కేసీఆర్  ఇలా చేస్తారని మేం ఊహించలేదని అన్నారు. కేసీఆర్‌ స్వయంగా మమ్మల్ని మద్దతు అడిగారు. అప్పుడు అతిథి సత్కారాలు కూడా చేశారు. ఇప్పుడు ఇలా చేయటం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు స్నేహం ఉందా ? బీజేపీ అండదండల కోసమే బీఆర్‌ఎస్ పని చేస్తోందని ఆరోపించారు.

మేం లేకపోతే ఏమయ్యేది?

మేమే లేకపోతే మునుగోడులో నీ పరిస్థితి ఏంటి అని నిలదీశారు. అంతేకాదు, మునుగోడులో బీఆర్‌ఎస్‌ కాకుండా బీజేపీ గెలిస్తే బీఆర్‌ఎస్‌ ప్రమాదంలో పడేదని వ్యాఖ్యానించారు. మునుగోడు ఉప ఎన్నిక సమయంలోనే...ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిగాయని ఆరోపించారు. మేమేంటో, మా బలం ఏంటో చూపిస్తాం అని తెగేసి చెప్పారు.

సీపీఐ, సీపీఎం కలసి పోటీ

కేసీఆర్‌ ఏకపక్షంగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల్ని ప్రకటించారని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఇలా చేస్తారని తాము ఊహించలేదని పేర్కొన్నారు.
సీట్ల సమస్య కాదు, రాజకీయ వైఖరిలోనే ఏదో తేడా వచ్చింది అని అభిప్రాయపడ్డారు. మాతో పొత్తు వద్దని కేసీఆర్‌ అనుకున్నప్పుడు, వెంపర్లాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. రాబోయే ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. ఈ పరిణామాలపై మేం పశ్చాత్తాపం పడటం లేదు. బీఆర్‌ఎస్‌తో స్నేహం అంశంలో మేం ఏ తప్పూ చేయలేదని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా 4,5 శాతం ఓట్లు 

''కేసీఆర్‌ మిత్రధర్మాన్ని తప్పారు. పొమ్మనకుండా పొగపెట్టారు. కేసీఆర్‌ అవకాశవాద వైఖరి వల్ల బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా 4, 5 శాతం ఓట్లు పడబోతున్నాయని వ్యాఖ్యానించారు. గద్దర్‌ మరణించాడు, మేం ఇంకా మరణించలేదు అంతే అని తీవ్రంగా స్పందించారు.

#cpi #cm-kcr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి