This Week OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాల సందడి..! స్ట్రీమింగ్ వివరాలివే

ఈ వారం ఓటీటీలో పలు సినిమాలు, సీరీస్ లు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సింబా, సత్య, కిల్, అడియోస్ అమిగో చిత్రాలు సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్, ది లేడీ కిల్లర్ సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి.

New Update
This Week OTT Movies: ఈ వారం ఓటీటీ సినిమాల సందడి..! స్ట్రీమింగ్ వివరాలివే

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడి చేయబోతున్న చిత్రాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాము.. 

అడియోస్ అమిగో

మలయాళ నటులు అసిఫ్ ఆలీ, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'అడియోస్ అమిగో'. నాహస్ నజర్ దర్శకత్వంలో కామెడీ డ్రామాగా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యావరేజ్ అనిపించుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

సింబా

జగపతి బాబు, అనసూయ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్,కస్తూరి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సింబా'. ఆగస్టు 9 న విడుదలైన ఈ చిత్రం.. తాజాగా ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

కిల్

బాలీవుడ్ నటుడు లక్ష్య, తాన్యా మనక్తిలా, రాఘవ్ కీలక పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’. జులై 6న థియేటర్స్ లో రిలీజైన ఈ మూవీ అంచనాలకు మించి విజయం సాధించింది. ఇక విడుదలైన రెండు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఓటీటీ ప్లాట్ డిస్నీ హాట్ స్టార్ లో సెప్టెంబర్ 6నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ది లేడీ కిల్లర్

అర్జున్ కపూర్ - భూమి పెడ్నేకర్ జంటగా నటించిన చిత్రం 'ది లేడీ కిల్లర్'. ఇటీవలే బాక్స్ ఆఫీస్ వద్ద ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది.

డబుల్ ఇస్మార్ట్

పూరి జగన్నాథ్ - రామ్ పోతినేని కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ డబుల్ ఇస్మార్ట్. ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా భారీ డిజాస్టర్ గా మిగిలింది. అయితే ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా సడెన్ గా ఓటీటీలోకి వచ్చేయడం గమనార్హం. సినిమా రిజల్ట్స్ ఏ దీనికి కారణం అన్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో 4th మిడ్ నైట్ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

సోనీ లివ్: తనావ్ సీజన్ 2 (హిందీ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 6
ఆహా: సత్య (తెలుగు మూవీ)- సెప్టెంబర్ 7

Also Read: This Week Movies: ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోయే సినిమాలు.. విజయ్ 'GOAT' కూడా..! - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు