Organ Donation: మరణించినా బతికే ఉన్నాడు.. ఫుడ్ డెలివరీ బాయ్ అవయవ దానం!

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌కు చెందిన 19 ఏళ్ల ఫుడ్‌ డెలివరీ బాయ్‌ బిస్వాల్‌ ప్రభాస్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయకు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యింది. కాంటినెంటల్ హాస్పిటల్స్‌ తల్లిదండ్రులకు అవయవదానం గురించి చెప్పగా.. వారు బిస్వాల్‌ అవయవాలను దానం ఇచ్చేందుకు అంగీకరించారు.

Organ Donation: మరణించినా బతికే ఉన్నాడు.. ఫుడ్ డెలివరీ బాయ్ అవయవ దానం!
New Update

Organs Donated Of Brain Dead Food Delivery Boy: మహాదానాల్లో 'అవయవ దానం' ఒకటి. నిజానికి అవయవ దానానికి మించిన దానం మరొకటి లేదు. శరీరంలో ఏ భాగమైనా ఎవరి కలలకైనా దారి చూపిస్తుందంటే అంతకంటే మంచి విషయం ఇంకోటి ఉండదు. ఖాళీ దేహాన్ని అగ్నిలో పేర్చడం కంటే అవయవలను దానం చేసి మరణించినా తర్వాత కూడా ఇతరులను సాయం చేయడం ఉత్తమం. తమ కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్‌ డెడ్‌ అయితే వారి అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరిస్తుండడం మంచి పరిణామంగా చెప్పవచ్చు. హైదరాబాద్‌లో (Hyderabad) ఇలాంటి ఘటనే జరిగింది. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఫుడ్ డెలివరీ బాయ్ అవయవాలు రోగులకు ప్రాణం పోశాయి. వారికి కొత్త ఊపిరిలూదాయి.



రాజేంద్రనగర్ మండలం వట్టినాగులపల్లి గ్రామంలో జొమాటో (Zomato) డెలివరీ బాయ్‌గా పనిచేసిన 19 ఏళ్ల బిస్వాల్ ప్రభాస్ (Biswal Prabhas) చనిపోయినా ఇంకా బతికే ఉన్నాడు. కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో తన అవయవాలను దానం చేసి ఇరుతుల ప్రాణాలను నిలబెట్టాడు. బిస్వాల్ ప్రభాస్ మార్చి 14న ఫుడ్ డెలివరీ చేస్తుండగా ఘోర ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే అతన్ని కాంటినెంటల్ హాస్పిటల్‌లో చేర్చారు. వారు ఎంత ప్రయత్నించినప్పటికీ బిస్వాల్‌ను కాపాడడం కష్టంగా మారింది. చివరకు వైద్యులు అతనికి బ్రెయిన్ డెడ్ అని ప్రకటించారు. ఈ కష్ట సమయంలో కాంటినెంటల్ హాస్పిటల్స్‌లోని వైద్యులు అవయవ దానం గురించి అతని తల్లిదండ్రులతో మాట్లాడారు. వారు చాలా బాధాలో ఉన్నప్పటికీ డాక్టర్లు చెప్పినదానికి అంగీకరించారు. కాలేయంతో సహా అతడి అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు. సోమవారం డాక్టర్ సెంథిల్ కుమార, ఆయన బృందం బిస్వాల్‌ కాలేయాన్ని మరొక వ్యక్తికి అందించారు. ఈ కాలేయ మార్పిడిని విజయవంతంగా నిర్వహించారు.

ఉదయం చదువు.. సాయంత్రం జాబ్‌:

ప్రభాస్ చాలా క్రమశిక్షణతో జీవనం సాగించాడు. చదువుతో పాటు జాబ్‌ను కూడా బ్యాలెన్స్‌ చేసుకున్నాడు. ఉద్యోగం ఉన్నప్పటికీ అతను విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు. ఉదయం చదువు, సాయంత్రాలు ఫుడ్‌ డెలవరీ చేసేవాడు. ఉద్యోగం, చదువుతో పాటు తన తోబుట్టువుల స్కూల్‌ వర్క్స్‌లో కూడా సహాయం చేసేవాడు. బాధతో తమ హృదయాలు ఎంతో బరువు ఎక్కినప్పటికీ తమ కొడుకు అవయవాలు ప్రాణాలను రక్షించాయని తెలుసుకోవడం కొంత ఓదార్పునిస్తుందని బిస్వాల్‌ పేరెంట్స్‌ చెబుతున్నారు.

Also Read: సివిల్స్ ఎగ్జామ్ వాయిదా.. రీ షెడ్యూల్ ఇదే!

#hyderabad #organ-donation
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe