Orange Peel Benefits : ఏంటీ.. నారింజ తొక్కలను పడేస్తున్నారా..? అయితే మీ అందం గురించి మర్చిపోండి ఆరెంజ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. సాధారణంగా అందరు ఈ పండు తిని తొక్క పడేస్తారు. కానీ పండు మాత్రమే దీని తొక్కతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నారింజ తొక్కలతో తయారు చేసిన పేస్ ప్యాక్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో తెలియాలంటే హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 07 Jan 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Benefits Of Orange Peel : నారింజ లో పుష్కలమైన పోషకాలు ఉంటాయి. రోజూ తినే ఆహారంలో వీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలను(Health Benefits) అందిస్తుంది. వీటిలో విటమిన్ C(Vitamin C) ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు, ఇతర వ్యాధుల దరి చేరకుండ పోరాడుతుంది. అలాగే నారింజలో ఫైబర్ గుణాలు శరీరంలో చక్కర స్థాయిలు నియంత్రించును. అంతే కాదు అధిక కొలెస్ట్రాల్ లెవెల్స్(Cholesterol Levels) ను తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల(Heart Diseases) నుంచి కాపాడును. అయితే ఈ పండు మాత్రమే కాదు దీని తొక్కతో కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలోని విటమిన్ సి చర్మ సౌందర్యానికి చాలా ముఖ్యం. మరి అందాన్ని పెంచడానికి ఈ తొక్కను ఎలా వాడాలో చూసేయండి.. ముఖ సౌందర్యాన్ని పెంచడానికి నారింజ తొక్కలను వాడే విధానం నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్ నారింజ తొక్కలు(Orange Peel) ఎండిన తర్వాత వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిలో 1 టీ స్పూన్ తేనే, కాసింత పసుపు, కలిపి బాగా మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఈ పేస్ట్ ను ముఖానికి, మెడకు అప్లై చేసి.. 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత మొహాన్ని క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆరెంజ్ లోని విటమిన్ సి, ఇతర పోషకాలు చర్మంలోని మృతకణాలను తొలగించి.. మొహాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఈ పీల్ ఆఫ్ మాస్క్ రోజ్ వాటర్, బియ్యం పిండితో కూడా కలిపి అప్లై చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఇలా చేస్తే స్కిన్ పై మంచి ప్రభావం ఉంటుంది. Also Read : Tea In Paper Cups : పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి డ్రై స్కిన్ ఉన్నవారు ఇలా అప్లై చేయండి డ్రై స్కిన్ ఉన్నవారికి ఆరెంజ్ పీల్ మాస్క్ మంచి హైడ్రేటింగ్ చిట్కాల పనిచేస్తుంది. నారింజ తొక్క పొడిలో 1 టీ స్పూన్ పాలు, 1 చెంచా కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లా తయారు చేసి.. 15 నిమిషాల పాటు మొహానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని హైడ్రేటింగ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. Also Read: Milk: పాలను వీటిలో కలిపి తాగితే.. ఎన్ని లభాలో తెలుసా #vitamin-c #cholesterol-levels #uses-of-orange-peel మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి