T20 Worldcup: సీనియర్లకే మొగ్గుచూపుతున్న యాజమాన్యం.. తుది జట్టు ఇదే!

జూన్ 1నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుండగా భారత తుది జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. రోహిత్ శర్మ నాయకత్వంలోనే బరిలోకి దిగుతుండగా ఈ మెగాటోర్నీలో సీనియర్లకే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు కుర్రాళ్లతో కూడిన టీమ్ ను ఫైనల్ చేసినట్లు సమాచారం.

New Update
T20 Worldcup: సీనియర్లకే మొగ్గుచూపుతున్న యాజమాన్యం.. తుది జట్టు ఇదే!

T20 World Cup 2024: మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచకప్ ప్రారంభంకానుండగా భారత తుది జట్టు కూర్పుపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రసవత్తరంగా సాగుతున్న ఐపీఎల్ లో సీనిర్లతో పోటీపడుతూ కుర్రాళ్లు దూసుకుపోతుండగా ఎవరికీ అవకాశం దక్కుతుందనే అంశం చర్చనీయాంశమైంది. అయితే క్రికెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం యాజమాన్యం అనుభమున్న సీనియర్లకే మొగ్గు చూపుతుందని, ఒకరిద్దరూ మినహా కొత్త వాళ్లకు అవకాశం లభించకపోవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.

ముగ్గురికే అవకాశం..
ఈ మేరకు జూన్ 1 నుంచి పొట్టి కప్ సంబరం మొదలుకానుంగా విండీస్ - యూఎస్‌ఏ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇప్పటికే రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. ఈ క్రమంలో భారత జట్టు ప్రకటనపై పలు కథనాలు వెలువడుతున్నాయి. 15 మందితో కూడిన జట్టును మరో రెండు వారాల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే 1 నాటికి ప్రాబుబల్స్‌ను ఐసీసీ కమిటీకి పంపించాల్సి వుండగా మే 25 వరకు అందులో మార్పులకు ఛాన్స్‌ ఉంటుంది. అయితే ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం స్క్వాడ్‌లో సీనియర్లకే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా మారిన మయాంక్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని అంచనా. రిషభ్‌ పంత్‌, రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

జట్టు అంచనా:
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్/చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, షమీ, సిరాజ్/ మయాంక్‌ యాదవ్.

Advertisment
Advertisment
తాజా కథనాలు