/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Opportunity-for-NRIs-to-renew-their-visa-1.jpg)
కష్టాలు త్వరలో తీరనున్నాయి
భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో అక్కడి ఎన్నారైలకు ఓశుభవార్త చెప్పారు. త్వరలో భారతీయుల వీసా కష్టాలు తీరుతున్నాయన్నారు. హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానాన్ని మరింతగా సరళీకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దిశగా త్వరలో ఓ పైలట్ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించబోతోందని, ఇందులో భాగంగా స్వదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎన్నారైలు తమ వీసాలను రెన్యూవల్ చేసుకునే అవకాశం దక్కనుందని సమాచారం.
హెచ్-1బీ వీసా రెన్యూవల్ విధానం
పైలట్ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా కొద్ది మంది విదేశీయులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ఈ విషయమై నేడే అమెరికా ప్రభుత్వం ఓ ప్రకటన వెలువరించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. హుచ్-1బీ వీసాదారుల్లో మెజారిటీ భారతీయులేనన్న విషయం తెలిసిందే. గతేడాది జారీ అయిన 4.42 లక్షల హెచ్-1బీ వీసాల్లో అత్యధికం భారతీయులే దక్కించుకున్నారు.