ప్రస్తుత ఉద్యోగ నియామకాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేయలేమా? పాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ప్రస్తుత నోటిఫికేషన్ లో వర్తింపు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు సామాజిక విశ్లేషకులు సంపతి రమేష్ మహారాజ్. మాదిగ ఉపకులాలు వీటిని కోల్పోతే ఒక తరం నష్టపోతుందని, ప్రభుత్వం సామాజిక న్యాయం చేయాలని కోరుతున్నారు. By srinivas 15 Oct 2024 in Opinion తెలంగాణ New Update షేర్ చేయండి SC Classification: భారతదేశం అనాదిగా నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో కూరుకుపోయినది. ఇందులో షెడ్యూల్ కులాలను అట్టడుగు స్థాయిలో ఉంచారు. వీరంతా వేల సంవత్సరాల నుంచి సామాజిక హక్కులు నిరాకరించబడి అస్పృశ్యత, అంటరానితనమనే వివక్షకు గురైనారు. ఈ కులాల ఉన్నతకై డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రాజ్యాంగంలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. షెడ్యూల్డ్ కులాల్లో ప్రధానంగా మాదిగ, మాల, ఇతర ఉపకులాలున్నాయి. వీరిలో అత్యధికంగా ఉండి, వెనబడ్డ కులం మాదిగ, వీటిలోని ఉపకులాలే. మాదిగ కులాన్ని వివిధ రాష్ట్రాల్లో పలు రకాల పేర్లతో పిలుస్తారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాలలతో పోలిస్తే మాదిగ జనాభా అధికం. కానీ వీరు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో వెనుకబడ్డారు. మెజార్టీ జనాభా గల మాదిగ కులానికి రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లలో తగిన వాటా దక్కకపోవడమే దీనికి కారణం. దీంతో మాల,మాదిగల మధ్య వైరుద్యం పెరిగింది. మంద కృష్ణ మాదిగ, ఇతర మాదిగ మేధావుల నేతృత్వంలో 1994న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడింది. దీని ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమం మొదలైంది. ఈ నేపథ్యంలో అనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1996 లో వర్గీకరణ అంశంపై జస్టిస్ పి.రామచంద్రమూర్తి కమిషన్ నియమించారు. ఈ కమిషన్ షెడ్యూల్ కులాల్ని వెనకబాటుతనం ఆధారంగా ఏ, బి, సి, డి లుగా వర్గీకరణ చేయాలనీ సిఫార్సు చేసింది. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను విద్యా, ఉద్యోగాల్లో వర్తింపచేయాలని సూచించింది. ఈ కమిషన్ నివేదిక మేరకు 2000 నుంచి ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ అమలు పరిచారు. ఇందులో బి-వర్గంలో ఉన్న మాదిగలకు 7 శాతం, సీ-వర్గంలో ఉన్న మాలలకు 6 శాతం, ఇతర ఉప కులాలకు మిగతా శాతాన్ని వర్తింపజేశారు. దీంతో కొంత వరకు మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో లబ్ధి జరిగింది. ఇది కూడా చదవండి: తగ్గేదేలేదంటున్న కొండా సురేఖ.. వేములవాడలో మరో వివాదం! ప్రస్తుత నోటిఫికేషన్లలో అమలు చేయలేమా? ఎస్సీ కులాల్లో సామాజిక సమానత్వం కోసం అమలుపరిచిన ఉప వర్గీకరణను రాజ్యంగ విరుద్దమని మాల సోదరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అదే E.V చెన్నయ్య VS యూనియన్ ఆఫ్ ఇండియా-2004 కేసు. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2000 నుంచి అమల్లో ఉన్న ఎస్సీ వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మాదిగ ఉప కులాలు నిరసన వ్యక్తం చేసి, వర్గీకరణ చట్టబద్ధతకై కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. ఈ నేపథ్యంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 2007లో ఉషా మేహ్ర కమిషన్ ను నియమించినది. ఈ కమిషన్ కూడా రిజర్వేషన్ల వర్గీకరణ అవసరమని నొక్కి చెప్పింది. కానీ ప్రభుత్వాలు ఓట్ల రాజకీయం కోసం ఇన్నాళ్లు దాటవేశారు. ఇటీవల సుప్రీం కోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో 20 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. స్టేట్ ఆఫ్ పంజాబ్ అండ్ అదర్స్ vs దేవీందర్‌సింగ్ కేసు విషయంలో E.V చెన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పును పునః సమీక్షించి ఆగస్టు1, 2024న ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టాలు అమల్లో ఉన్నట్టే కదా. మన తెలుగు రాష్ట్రాలలో కూడా అమలైన 2000 నాటి ఎస్సీ వర్గీకరణ చట్టం కూడా అమల్లో ఉన్నట్టే. అలాంటప్పుడు ప్రస్తుత నోటిఫికేషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణను అమలు చేయవచ్చు కదా. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అసెంబ్లీలో ప్రస్తుత నోటిఫికేషన్ల లో వర్గీకరణను అమలు చేస్తామన ప్రకటించారు. ఇది కూడా చదవండి: సినీ పరిశ్రమతో భట్టి కీలక భేటీ.. అందుకు సిద్ధమంటూ సంచలన ప్రకటన! ఎస్సీ వర్గీకరణతో సామాజిక న్యాయం.. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో స్థానికతపైన కోర్టులు విభిన్న తీర్పులు ఇచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ యాక్ట్ 1959 లోని ముల్కీ నిబంధనలకు రక్షణ కల్పించే సెక్షన్ 3ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1969 ఫిబ్రవరి 3న కొట్టివేసింది. అప్పుడు పాత చట్టమైన పెద్దమనుషుల ఒప్పందం-1956లోని సెక్షన్119 కింద ముల్కీ నిబంధనలకు రక్షణ ఉంటుందని సుప్రీంకోర్టు 1972 అక్టోబర్ 3న చారిత్రాత్మక తీర్పునిచ్చింది. అనగా కొత్త చట్టంలో స్థానికత తొలగించినప్పుడు పాత చట్టంలోని స్థానికత చెల్లుబాటువుతుందని 1972 నాటి కోర్టు తీర్పు సారాంశం. దీన్ని బట్టి ఎస్సీ వర్గీకరణపై 2000 నాటి పాత చట్టం అమలులో ఉన్నట్టే. ప్రస్తుత ఉద్యోగ నియామకాల్లో కూడా దీన్ని వర్తింపచేయవచ్చు కదా. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. ఈ కమిటీ వర్గీకరణ కోసం ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని సూచించింది. ఈమేరకు ఇటీవల తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై సమగ్ర అధ్యయనం చేసేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. ఇదీ 60 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడుపు విధించారు. అనంతరమే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అమలు చేస్తామని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఇప్పుడు జరిగే గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర అత్యున్నత ఉద్యోగ నియామకాల్లో మాదిగలకు అన్యాయం జరుగుతుంది. అయితే కమిషన్ అధ్యయనం తర్వాత వర్గీకరణ అమలైతే మాదిగలకు మరింత లాభం జరగవచ్చమో కానీ, ప్రస్తుత నోటిఫికేషన్ లో చాలా నష్టం జరగవచ్చు. కావున పాత ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను ప్రస్తుత నోటిఫికేషన్ లో తక్షణం వర్తింపు చేయాలి. గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్ -3, గ్రూప్ -4, డిఎస్సీ, కానిస్టేబుల్ వంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు ఎన్నో ఏళ్ల తర్వాత వస్తుంటాయి. మాదిగ ఉపకులాలు వీటిని కోల్పోతే ఒక తరం నష్టపోతుంది. కాబట్టి ప్రభుత్వం పునరాలోచించి ఎస్సీ వర్గీకరణ అమలు ద్వారా సామాజిక న్యాయం చేయాలి. ఇది కూడా చదవండి: Bihar: లవర్ కోసం ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసా? ఇది కూడా చదవండి: క్రైమ్ ప్రపంచానికి రారాజు.. లారెన్స్ బిష్ణోయ్ నేర ప్రస్థానమిదే! సంపతి రమేష్ మహారాజ్సామాజిక విశ్లేషకులు7979579428. #jobs #sc-classification మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి