Operation Valentine Movie Review: వరుణ్ తేజ్.. మెగా కంపౌండ్ నుంచి వచ్చిన హీరో. కానీ, సినిమాల ఎంపికలో కొంత వైవిధ్యమైన ధోరణి కనబరుస్తాడు. ఫిదా.. ముకుంద..గని.. గద్దలకొండ గణేష్.. అంతరిక్షం.. ఇలా ఒకదానికొకటి సంబంధం లేని సినిమాలను ఎంచుకుని చేస్తుంటాడు. అదే కోవలో ఇప్పుడు ఆపరేషన్ వాలంటైన్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫిదా, తొలిప్రేమ తర్వాత వరుణ్ తేజ్ కు హిట్ పడలేదు. గని, గాండీవధారి అర్జునుడు తో డిజాస్టర్లు పడ్డాయి. అయినా, తన ప్రయోగాల దారిని మార్చుకోలేదు. ఆపరేషన్ వాలంటైన్ ఈరోజు అంటే మార్చి 1న విడుదలైంది. పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం..
ఇదీ స్టోరీలైన్..
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్ లీడర్.. అర్జున్ రుద్రదేవ్ అలియాస్ రుద్ర (వరుణ్ తేజ్). ఏదైనా సరే ఏమి జరుగుతుంది? చూద్దాంలే అని ప్రమాదాలకు ఎదురు వెళ్లే వ్యక్తి అతను. అతను ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసే రాడార్ ఆఫీసర్ అహానా గిల్ (మానుషి చిల్లర్)ని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో అర్జున్ వజ్ర అనే ప్రాజెక్ట్ కోసం పని చేస్తాడు. ఆ సమయంలో అతనికి చేదు అనుభవం ఎదురవుతుంది. తన ప్రమాదాలకు ఎదురువెళ్లే తత్వంతో అందులో దెబ్బతింటాడు. ఈ దెబ్బ నుంచి బయటపడుతూనే ఆపరేషన్ వాలంటైన్ (Operation Valentine Movie Review)గురించి రంగంలోకి దిగుతాడు అర్జున్. అసలు ఈ ఆపరేషన్ ఏమిటి? దానికి వజ్ర ప్రాజెక్ట్ కి లింక్ ఏమిటి? అసలు ఏ లక్ష్యం కోసం ఈ ఆపరేషన్? ఈ విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఎలా ఉందంటే..
సినిమా సాదాసీదాగా ప్రారంభం అవుతుంది. ఒకవిధంగా ఫస్టాఫ్ అసలు ఎవరికీ కనెక్ట్ కాదు. ఏదేదో జరుగుతూ ఉంటుంది. పుల్వామా దాడి నేపథ్యంలో సినిమా(Operation Valentine Movie Review) అనేసరికి సినిమాకి వెళ్లిన వాళ్ళు కనెక్ట్ అయ్యే విధంగా ఫస్టాఫ్ లో ఏమీ ఉండదు. కానీ.. ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ లో ఒక్కసారిగా తరువాత ఏమవుతుంది? అనే ఉత్కంఠ కచ్చితంగా అందరికీ కలుగుతుంది. దానికి తగ్గట్టే సెకండ్ హాఫ్ సినిమా.. పూర్తిస్థాయి ఎమోషన్.. యాక్షన్ తో సాగుతుంది. అందరికీ పుల్వామా దాడి అంటే తెలుసు. కానీ, ఇది ఎలా జరిగింది? దీనివెనుక ప్రభుత్వం ఏ రకమైన విధానాల్ని అనుసరించింది.. ఇలాంటి పాయింట్స్ అన్నిటినీ చూపించే ప్రయత్నం దర్శకుడు చేశాడు. సినిమా చివరికి వచ్చేసరికి గూస్ బంప్స్ వచ్చేలా క్లైమాక్స్ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్.. క్లైమాక్స్ అయితే.. సినిమా చూసే ప్రతి పేక్షకుడికి దేశభక్తి పొంగిపోయేలా ఉంటాయి. ప్రతి సీన్.. ప్రేక్షకుడ్ని పుల్వామా సమయంలో దేశంలో పరిస్థితికి కనెక్ట్ చేసేస్తుంది.
Also Read: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్
ఎవరెలా చేశారంటే…
వరుణ్ తేజ్ అర్జున్ గా (Operation Valentine Movie Review) అదరగొట్టేశాడని చెప్పాలి. తనదైన శైలిలో ఆ క్యారెక్టర్ కి న్యాయం చేశాడు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా అర్జున్ దేవ్ పాత్రకు వరుణ్ తేజ్ సరిగ్గా సరిపోతాడు. అతన్ని సినిమాలో చూస్తుంటే నిజంగా మనం వింగ్ కమాండర్ ని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. మానుషి చిల్లర్ అందంగా కనిపించింది. ఎమోషనల్ గా బాగా చేసింది. ఇక నవదీప్ పాత్ర అర్ధాంతరంగా ఆగిపోతుంది. బాగానే చేశాడు. శుభ శ్రీ, లహరి, శ్వేతా వర్మ కూడా కనిపిస్తారు. అయితే వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలిన వారంతా ఉన్నటంతలో బాగానే చేశారు.
టెక్నికల్ గా..
బీజీఎం, వీఎఫ్‌ఎక్స్, సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి (Operation Valentine Movie Review) ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని చెప్పవచ్చు. టెక్నికల్ డిపార్ట్‌మెంట్ల పనితీరు ఈ సినిమాని సాధారణ ప్రేక్షకులకు కూడా మంచి అనుభూతిని ఇస్తుందనడంలో సందేహం లేదు. అన్ని సన్నివేశాలు చాలా రిచ్‌గా వచ్చాయి. సోనీ పిక్చర్స్ నిర్మాణ విలువలు హై స్టాండర్డ్‌గా ఉన్నాయని చెప్పవచ్చు. దేశభక్తి సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. కొన్ని సన్నివేశాలు చాలా ఎమోషనల్‌గా ఉంటాయి, ఇది సినిమాకు మంచి హైప్ ఇచ్చింది.
మొత్తంగా చూసుకుంటే, ఆపరేషన్ వాలంటైన్ సినిమా ఒకసారి థియేటర్లలో చూడదగ్గ సినిమాగా చెప్పుకోవచ్చు. ఫస్టాఫ్ కాస్త గందరగోళంగా అనిపించినా.. సెకండ్ హాఫ్ సినిమా మాత్రం వేరే లేవెల్ లో ఉంటుంది. మనం ఫస్టాఫ్ చూసిన విషయమే మర్చిపోతాం. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ అయితే నెక్స్ట్ లెవెల్. దేశభక్తి సినిమాలు ఇష్టపడే వారే కాకుండా.. సాధారణ ప్రేక్షకులకు కూడా దేశభక్తిని కచ్చితంగా రేకెత్తించేలా ఉంటుంది సినిమా సెకండ్ హాఫ్.
అదండీ విషయం ఫలితాలతో పనిలేకుండా.. వెరైటీ సినిమాలు చేయాలనుకునే వరుణ్ తేజ ప్రయత్నాల్లో ఆపరేషన్ వాలెంటైన్ ఒక మంచి సినిమా అనే చెప్పవచ్చు. ఈ సినిమాకి 2.5/5 రేటింగ్ ఇవ్వచ్చు.
నటీనటులు: వరుణ్‌తేజ్, మానుషి చిల్లర్, నవదీప్, మిర్ సర్వర్, రుహానీ శర్మ తదితరులు
టెక్నీకల్ టీమ్: సంగీతం: మిక్కీ జే మేయర్; సినిమాటోగ్రఫీ: హరి కె. వేదాంతం; ఎడిటింగ్: నవీన్ నూలి; మాటలు: సాయి మాధవ్ బుర్రా
నిర్మాత: సోనీ పిక్చర్స్, సందీప్ ముద్ద; దర్శకత్వం: శక్తి ప్రతాప్ సింగ్ హడా
ఆపరేషన్ వాలెంటైన్ ట్రైలర్ ఇక్కడ చూడొచ్చు..