Open AI Report: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో భారత్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయేల్ లో కుట్ర 

దేశంలో సార్వత్రిక ఎన్నికలను ప్రభావితం చేయడానికి కుట్ర జరిగినట్టు OpenAI పేర్కొంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించి ఒక ఇజ్రాయేల్ సంస్థ నడుపుతున్న నెట్‌వర్క్ బీజేపీ వ్యతిరేక ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నించి విఫలమైందని OpenAI చెబుతోంది. 

Open AI Report: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో భారత్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఇజ్రాయేల్ లో కుట్ర 
New Update

Open AI Report:  దేశంలో 2024 లోక్‌సభ ఎన్నికల చివరి దశ కొద్దిసేపటి క్రితం ప్రారంభం అయింది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి నాలుగు రోజుల ముందు షాకింగ్ సమాచారం వచ్చింది. భారతదేశంలో ఎన్నికలను ప్రభావితం చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లు OpenAI పేర్కొంది. భారత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఒక ఇజ్రాయెల్ సంస్థ నడుపుతున్న నెట్‌వర్క్ బీజేపీ వ్యతిరేక ఎజెండాను అమలు చేయడానికి ప్రయత్నించి విఫలమైందంటూ  OpenAI షాకింగ్ సమాచారాన్ని వెల్లడించింది. ఇజ్రాయెల్ సంస్థ STOIC ఇండియా కూటమికి అనుకూలంగా వ్యవహరిస్తూ.. అధికార బీజేపీని విమర్శిస్తూ,  ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని ప్రశంసిస్తూ వ్యాఖ్యలు సృష్టిస్తున్నట్లు OpenAI కనుగొంది. 

Open AI Report:   లోక్‌సభ ఎన్నికలకు అంతరాయం కలిగించేందుకు ఇజ్రాయేల్ సంస్థ ప్రయత్నించిందని OpenAI చెబుతోంది. అలాగే ఆ సంస్థ బీజేపీకి వ్య తిరేక అజెండాను రూపొందించింది. భారత ఎన్నికలపై దృష్టి సారించే కార్యకలాపాలు ఈ సంస్థ మేలో ప్రారంభించినట్లు నివేదిక పేర్కొంది. నెట్‌వర్క్‌ను ఇజ్రాయెల్ రాజకీయ ప్రచార నిర్వహణ సంస్థ STOIC నిర్వహిస్తోంది.

Also Read: చివరిదశ ఎన్నికలు..ప్రధాని మోదీ సహా పోటీలో ఉన్న ప్రముఖులు వీరే!

Open AI Report:  ఓపెన్‌ఏఐ నివేదిక ప్రజాభిప్రాయాన్ని మార్చేందుకు లేదా రాజకీయ ఫలితాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించే రహస్య కార్యకలాపాల కోసం AIని ఉపయోగించిన ప్రచారాలను ఉదాహరణగా చూపించింది. రహస్య కార్యకలాపాల కోసం కంటెంట్‌ను సృష్టించడానికి..  సవరించడానికి ఇజ్రాయెల్ నుండి పనిచేస్తున్న గ్రూప్ ఎకౌంట్స్ ఉపయోగించినట్లు  నివేదిక పేర్కొంది. ఆ కంటెంట్ X, Facebook, Instagram, వెబ్‌సైట్‌లు, YouTubeలో షేర్ చేశారు. 

OpenAI అనేది డిసెంబర్ 2015లో స్థాపించబడిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ పరిశోధన సంస్థ. చాట్‌జిపిటి నిర్వహిస్తున్న సంస్థ OpenAI. ఇజ్రాయేల్ సంస్థ తన ప్లాట్‌ఫారమ్‌లను కాంగ్రెస్ అనుకూల, బిజెపి వ్యతిరేక కంటెంట్‌ను రూపొందించడానికి బహుళ ప్రచార కార్యకలాపాలకు ఉపయోగించిందని తేల్చింది. అలాగే ఎన్నికల ప్రక్రియకు అంతరాయం కలిగించే ప్రయత్నంలో ఆన్‌లైన్‌లో వార్తలను స్ప్రెడ్ చేసిందని వెల్లడించింది. 

#open-ai #isreal
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe