California Wildfire: వీడి దుంప తెగ! ఒకే ఒక్కడు.. లక్షల ఎకరాలు తగలెట్టేశాడు!!

కాలిఫోర్నియాలో ఒక కార్చిచ్చు దాదాపు 4 లక్షల ఎకరాలను బూడిద చేసింది. ది పార్క్ ఫైర్ గా చెప్పుకుంటున్న ఈ బడబాగ్నికి కారణం ఒకే వ్యక్తి అని కనుగొన్నారు. రోనీ డీన్ స్టౌట్ II అనే నిందితుడు తన కారుతో మంటలు రేగేలా చేశాడని పోలీసులు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. 

New Update
California Wildfire: వీడి దుంప తెగ! ఒకే ఒక్కడు.. లక్షల ఎకరాలు తగలెట్టేశాడు!!

California Wildfire:  కావాలని చేశాడో.. మతి తప్పి చేశాడో కానీ, ఒకే ఒక్కడు చేసిన పనికి లక్షల ఎకరాలు తగలబడిపోయాయి. వేలాది మంది ప్రాణాలు చేత పట్టుకుని పరుగులు తీయాల్సి వచ్చింది. ఈ సంఘటన జరిగింది ఉత్తర కాలిఫోర్నియాలో. ఒక వ్యక్తి కావాలని అడవికి నిప్పుపెట్టాడని భావిస్తున్న ఈ కార్చిచ్చు “ది పార్క్ ఫైర్” గంటకు 20 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అన్నిటినీ తగలబెట్టేస్తోంది. బూడిద కుప్పలుగా మారుస్తోంది. ఓ వ్యక్తి కాలిపోతున్న కారును దొరలించడంతో మంటలు మొదలైనట్టు అనుమానించి 42 ఏళ్ల అనుమానితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. 

చికో నగరానికి సమీపంలోని బుట్టే కౌంటీలో పార్క్ ఫైర్‌ను ప్రారంభించడంలో ఇతనికి సంబంధం ఉందని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని రోనీ డీన్ స్టౌట్ II గా గుర్తించర్రు. దీంతో అతన్ని అరెస్టు చేసి బెయిల్ లేకుండా జైలులో ఉంచినట్లు బుట్టే కౌంటీ జిల్లా అటార్నీ మైక్ రామ్‌సే తెలిపారు.సోమవారం అతనిని కోర్టులో హాజరుపరుస్తారు. 

California Wildfire:  "కారును దాదాపు 60 అడుగుల ఎత్తులో ఉన్న కట్టపైకి తీసుకువెళ్లి మాన్తా పెట్టి వదిలేశాడు నిందితుడు. దాంతో అది పూర్తిగా కాలిపోయింది, మంటలు వ్యాపించాయి, ఇది పార్క్ మంటలకు కారణమైంది" అని రామ్సే ఒక ప్రకటనలో తెలిపారు.  తరువాత స్టౌట్‌గా గుర్తించబడిన ఈ వ్యక్తి ఇతర పార్క్ సందర్శకులతో కలిసి వేగంగా వ్యాపిస్తున్న అగ్నిప్రమాదం నుండి పారిపోవడం ద్వారా ప్రశాంతంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడం కనిపించిందని రామ్‌సే చెప్పారు.

బిడ్‌వెల్ పార్క్‌లోని చికో నగరానికి ఈశాన్య దిశలో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో పార్క్ లో మంటలు మొదలయ్యాయి. వీటివల్ల శుక్రవారం రాత్రిపూట 164,000 ఎకరాలకు పైగా అడవి కాలిపోయింది. లెక్కలేని సంఖ్యలో  నిర్మాణాలను ధ్వంసం చేసింది.  దాదాపు 400 మంది జనాభా ఉన్న కోహస్సెట్ పట్టణం మొత్తం మంటల్లో చిక్కుకుంది. ఉత్తర చికోలోని జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లకు మంటలు వ్యాపించకుండా నిరోధించడానికి 1,100 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్లను ఉపయోగించి-బుల్డోజర్‌లతో ఫైర్ లైన్‌లను కత్తిరించే ప్రయత్నంలో మంటలను అదుపు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. అక్కడ గాలులు, ఎత్తైన కొండల కారణంగా మంటలను అదుపు చేయడం కష్టసాధ్యంగా మారింది. దీంతో 16 హెలీకాఫ్టర్లను, 2,500 మంది అగ్నిమాపక సిబ్బందిని అక్కడ మోహరించారు. అయినప్పటికీ మంటలను అదుపు చేయడం కష్టంగా మారింది. మొత్తంగా దాదాపు 3,48,000 ఎకరాలు దహనం అయిపోయాయని అధికారులు తెలిపారు.

Also Read: జైలు నుంచి బయటపడ్డ గ్యాంగ్ స్టర్ సంబరం.. పోలీసుల ఊహించని ట్విస్ట్

Advertisment
తాజా కథనాలు