Biryani: బిర్యానీ లవర్స్‌కు షాక్.. రెస్టారెంట్ల సంచలన నిర్ణయం! హైదరాబాద్‌లో బిర్యానీ లవర్స్ రెస్టారెంట్ల పట్ల అసంతృప్తిగా ఉన్నారు. వారం రోజులుగా ఆర్డర్ చేస్తున్న బిర్యానీలో మంచింగ్‌కు తినే ఉల్లిపాయ కనిపించడంలేదు. ఉల్లి ధరలు కేజీ రూ.100కు టచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో రెస్టారెంట్లు తెలివిగా ఉల్లిపాయను ఇవ్వడంలేదని సమాచారం. By Trinath 03 Nov 2023 in Latest News In Telugu హైదరాబాద్ New Update షేర్ చేయండి మీరు బిర్యానీ లవర్సా? ముక్క లేనిదే గొంతులో ముద్ద దిగదా? రెస్టారెంట్ల నుంచి స్విగ్గి, జొమాటొలో బిర్యానీ ఆర్డర్ చేసుకునే అలవాటు ఉందా.? అయితే మీకు షాకింగ్ న్యూస్. ఇక బిర్యానీని గతంలో లాగా ఎంజాయ్ చేసి తినలేము. మనకు అన్నిటికంటే ఇష్టమైనది అందులో మిస్ అవుతుంది. ఇంతకీ ఏం మిస్ అవుతుంది? బిర్యానీ ఫైల్ (PC:Unsplash) ఇదేంటి.. కవర్‌లో ఒకటి మిస్ అయ్యిందే! ఫ్రెండ్స్ అంతా కలిసి బిర్యానీ(Biryani) ఆర్డర్ చేశారు.. డెలవరీ బాయ్ వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్లిపోయాడు. అప్పటికే ఆకలితో ఉన్న ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫాస్ట్‌గా ప్లేట్లు తెచ్చుకుని కవర్ సీల్ తీశారు. తీరా కవర్ ఓపెన్ చేస్తే షాక్.. 'వీడేంట్రా.. మళ్లీ ఉల్లిపాయ వెయ్యలేదు..' అని అందులో కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేదేం లేక.. ఉల్లిపాయ లేకుండానే తిన్నారు..ఇది హైదరాబాద్(Hyderabad)లో చాలా మంది బ్యాచిలర్ ఫ్రెండ్స్ ఆవేదన. వారం రోజులుగా బిర్యాని ఆర్డర్ పెట్టుకుంటున్నవాళ్లకి శాటిస్‌ఫెక్షన్ ఉండడంలేదు. బిర్యానీ కవర్‌లో నిమ్మకాయ, గ్రెవీ ఉంటున్నాయి.. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది మిస్ అవుతుంది. అదే ఉల్లిపాయ. అసలు కవర్ మొత్తం చెక్ చేసినా ఉల్లిపాయి కనిపంచడంలేదు. కనీసం ఒక స్లైస్ ఆనియన్ కూడా అందులో ఉండడంలేదు. దీంతో ఆర్డర్ చేసినాళ్లు రెస్టారెంట్లకు కాల్ చేసి అడుగుతున్నారు. మర్చిపోయామని.. ఉల్లిపాయలు వేయడంలేదని సమాధానం చెబుతున్నారు రెస్టారెంట్ ఓనర్లు. 'అదేంటి మొన్నటివరకు ఇచ్చారు కదా'.. అంటే ఏదో వింత సమాధానం చెబుతున్నారు. కాల్ కట్ చేసిన తర్వాత ఆలోచిస్తే అసలు మేటర్ అర్థమవుతుంది. 'నిన్ననే కదా టీవీలో ఉల్లి ధరలు పెరిగాయని విన్నాను.. ఇందాకే కదా న్యూస్ వెబ్‌సైట్‌లో ఆనియన్ ధరలు రెట్టింపు ఐనట్టు' చదివాను.. అందుకేనేమో అసలు వేయడంలేదు అని అసలు నిజాన్ని తెలుసుకుంటున్నారు. ఉల్లిపాయ ఫైల్ (PC:Unsplash) పెరిగిన ధరలు: దేశవ్యాప్తంగా ఆనియన్ ధరలు పెరుగుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఉల్లి ధరలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. ఉల్లిపాయ ధరలు రేపోమాపో కేజీ రూ.100కు టచ్ అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఉల్లి ధర కూడా పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ఉల్లిలేని కూరలు చాలా తక్కువగా ఉంటాయి. కూరల్లో ఉల్లిపాయ చాలా ముఖ్యం. ఈ ఒక్క వారంలోనే ఉల్లి ధర డబుల్ అయ్యింది. గత వారం కేజీ రూ.45 పలికిన ఉల్లిధర ఇప్పుడు కేజీ రూ.80 నుంచి రూ.90వరకు పలుకుతోంది. సప్లై-డిమాండ్‌లో మిస్ మ్యాచ్ కారణంగానే ధరలు పెరిగినట్టుగా తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం టమాటా ధరలు భారీ స్థాయిలో పలికాయి. గత జులైలో కేజీ టమాటా రూ.200 వరకు పలికింది. ఉల్లి ధర కూడా ఇలానే పీక్స్‌కు వెళ్తుందానన్న టెన్షన్ ప్రజల్లో కనిపిస్తోంది. Also Read: 26 గంటల్లోనే ఇంటి నిర్మాణం…సిమెంట్, ఇటుకలు అక్కర్లేదు #biryani #hyderabad-biryani #biryani-lovers మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి