మొన్నటివరకు టమోటా వంతు..ఇప్పుడు ఉల్లి వంతు. కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. టమోటా ధరలతో షాక్ అయిన సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇప్పుడు ఉల్లిపేరు చెబుతేనే భయపడుతున్నారు. డిమాండ్ కు తగ్గ సరఫరా లేకపోవడంతో ఉల్లి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో ఉల్లి ధరలు కొద్ది వారాల్లోనే రెండింతలు పెరిగాయి. ఈసారి రుతుపవనాలు ఆలస్యం రావడంతో ఆ ఎఫెక్ట్ ఉల్లిపై పడింది. ఫలితంగా డిమాండ్ కు తగ్గట్లుగా మార్కెట్లో ఉల్లిపాయలు లేకపోవడంతో ధరలు ఆమాంతం పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. నిన్న మొన్నటి వరకు 20 నుంచి 30 రూపాయలు పలికిన ఉల్లి ధరలు ఇప్పుడు కిలో 40 నుంచి 50 రూపాయలకు చేరుకుంది. ఈ రేటు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంది.
ఇది కూడా చదవండి: ఎన్నికల దెబ్బకు పెళ్లి బాజాలు మోగే ఇళ్లల్లో ఆందోళన..ఎందుకంటే..!!
కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ లో టమాటా ధరలు భారీగా పెరిగాయి. కిలో టమోటా ధర రూ. 200 వరకు విక్రయించారు. ఆ తర్వాత ధరలు తగ్గిపోయాయి. టమోటా ధరలు పెరగడంతో చాలామంది కొనేందుకు వెనకడుగు వేశారు. ఇప్పుడు ఉల్లి ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. పండగల సీజన్ కావడంతో ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: అదే పనిగా ఇయర్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారా? జరిగేది ఇదే..!
కర్నాటకలో ఉల్లిపంటను అధికంగా పండిస్తారు. అయితే కొన్నాళ్లుగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈసారి రుతుపవనాలు ఆలస్యం కావడంతో ఉల్లిసాగుపై రైతులు పెద్దగా ఆసక్తి చూపలేదు. వర్షాభావ పరిస్ధితుల వల్ల సాగు చేసిన వేల హెక్టార్ల ఉల్లిపంట చేతికి అందకుండా పోతుందని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కంటే మహారాష్ట్రలో ఎక్కువగా ఉల్లిని సాగుచేస్తారు. ధర తక్కువగా ఉండటంతో చాలా మంది రైతులు పంట సాగు తగ్గించారు. ఈ ఏడాది భారీ వర్షాలు వరదల కారణంగా చాలా చోట్ల ఉల్లిపంటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. దీంతో ఉల్లిదిగుబడి తగ్గింది. ఫలితంగా ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అయితే ఇప్పట్లో ఉల్లి ధరలు తగ్గే ఛాన్స్ లేదంటున్నారు. నవంబర్ తర్వాత తగ్గుతాయని వ్యాపారులు అంటున్నారు.