ఒకపక్క ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని(Onion Exports) అకస్మాత్తుగా ఎత్తేసింది ప్రభుత్వం. గత అక్టోబర్ నెలలో ఉల్లిధరలు ఆకాశాన్నంటాయి. ఈ సమయంలో సామాన్యులపై భారం తగ్గించడం కోసం.. దేశంలో ఉల్లిధరలు నియంత్రించడానికి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఉల్లి ధరలు నియంత్రణలోకి వచ్చాయి. ఆ తరువాత ఉల్లి ఎగుమతులపై(Onion Exports) నిషేధాన్ని తొలగించాలని ఉల్లి రైతులు చాలాసార్లు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి మార్కెట్లో ఉల్లిధరలు కూడా నియంత్రణలోనే కొనసాగుతున్నాయి.
పూర్తిగా చదవండి..Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?
ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు నిషేధం ఎత్తివేశారు? దేశంలో దీనివలన ఉల్లి ధరల పెరుగుదలకు అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే.
Translate this News: